 
													
WC 2022 Final: అలిస్సా హేలీ ప్రపంచ రికార్డు.. ఎవరికీ సాధ్యం కాని ఫీట్! గిల్‌క్రిస్ట్ రికార్డు బద్దలు
ICC Women World Cup 2022 Final Aus Vs Eng- Alyssa Healy: ఐసీసీ మహిళా వరల్డ్‌కప్-2022 టోర్నీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ అలిస్సా హేలీ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడింది. ఇంగ్లండ్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విధ్వంసకర ఆట తీరుతో విరుచుకుపడింది. కేవలం 138 బంతుల్లోనే 170 పరుగులు చేసి వారికి పీడకలను మిగిల్చింది. అలిస్సా ఏకంగా 26 ఫోర్లు బాదిందంటే ఆ బౌలర్ల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
ఈ క్రమంలో తన అద్భుత ఇన్నింగ్స్‌తో అలిస్సా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆడం గిల్‌క్రిస్ట్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ ఫైనల్లో అత్యధిక స్కోరు సాధించిన క్రికెటర్ల జాబితాలో ప్రథమస్థానంలో నిలిచింది. క్రికెట్ దిగ్గజాలు ఆడం గిల్‌క్రిస్ట్, రిక్కీ పాంటింగ్, వివియన్ రిచర్డ్స్‌ను వెనక్కి నెట్టింది. తద్వారా ప్రపంచకప్ ఫైనల్లో అరుదైన ఫీట్‌తో సువర్ణాక్షరాలతో తన పేరును లిఖించుకుంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే హేలీ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది.
ఐసీసీ ప్రపంచకప్ ఫైనల్లో అత్యధిక స్కోర్లు
1. అలిస్సా హేలీ(ఆస్ట్రేలియా)- 170 పరుగులు- ప్రత్యర్థి ఇంగ్లండ్- 2022
2. ఆడం గిల్‌క్రిస్ట్(ఆస్ట్రేలియా)- 149 పరుగులు- ప్రత్యర్థి శ్రీలంక-2007
3. రిక్కీ పాంటింగ్(ఆస్ట్రేలియా)- 140 పరుగులు(నాటౌట్)- ప్రత్యర్థి ఇండియా- 2003
4. వివియన్ రిచర్డ్స్(వెస్టిండీస్)- 138 పరుగులు(నాటౌట్)- ప్రత్యర్థి ఇంగ్లండ్- 1979
చదవండి: IPL 2022: ఢిల్లీ జట్టుకు గుడ్‌న్యూస్.. వాళ్లిద్దరూ జట్టులోకి రానున్నారన్న పాంటింగ్!

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
