మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా భారత్‌తో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా యువ ఓపెనర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ సంచలన ఇన్నింగ్స్ ఆడింది. ఈ కీలక పోరులో 22 ఏళ్ల లిచ్‌ఫీల్డ్ అద్బుతమైన సెంచరీతో చెలరేగింది. భారత బౌలర్లను ఉతికారేసింది.
దీప్తీ శర్మ వంటి స్టార్ స్పిన్నర్‌ను సైతం లిచ్‌ఫీల్డ్ విడిచిపెట్టలేదు. రివర్స్ స్వీప్, స్కూప్ షాట్లతో ఈ ఆసీస్ యువ సంచలనం అలరించింది. ఆమె పెర్రీతో కలిసి రెండో వికెట్‌కు 155 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన లిచ్‌ఫీల్డ్.. కేవలం 77 బంతుల్లోనే తన మూడో వన్డే సెంచరీ మార్క్‌ను అందుకుంది.
ఆమెకు ఇదే తొలి వరల్డ్ కప్ సెంచరీ కావడం విశేషం. ఓవరాల్‌గా 93 బంతులు ఎదుర్కొన్న లిచ్‌ఫీల్డ్.. 17 ఫోర్లు, 3 సిక్స్‌లతో 119 పరుగులు చేసింది. దీంతో మహిళల వన్డే వరల్డ్‌కప్ నాకౌట్స్‌లో సెంచరీ చేసిన మూడో ఆసీస్ ప్లేయర్‌గా లిచ్‌ఫీల్డ్ నిలిచింది. ఆమె కంటే ముందు హీలీ, కరెన్ రోల్టన్ ఈ ఫీట్ సాధించారు.
అదే విధంగా మహిళల వన్డే ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ప్లేయర్‌గా లిచ్‌ఫీల్డ్ రికార్డు నెలకొల్పింది. ఇంతకుముందు ఈ రికార్డు హర్మన్ ప్రీత్ కౌర్ పేరిట ఉండేది.
2017 ప్రపంచకప్ సెమీస్‌లో ఆసీస్‌పై హర్మన్ 90 బంతుల్లో సెంచరీ నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో కేవలం 77 బంతుల్లోనే శతక్కొట్టిన లిచ్‌ఫీల్డ్.. హర్మన్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేసింది.
WHAT A SHOT BY 22 YEAR OLD PHOEBE LITCHFIELD AGAINST DEEPTI SHARMA.🔥
- Phoebe Litchfield & Ellyse Perry dominating Indian bowlers Kranti Gaud, Radha, Amanjot Kaur.🥶
pic.twitter.com/WpHTXWA0AC— MANU. (@IMManu_18) October 30, 2025


