ఐసీసీ అంధుల మహిళల టీ20 ప్రపంచకప్ 2025లో భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం కొలంబో వేదికగా జరిగిన సెమీ-ఫైనల్‌లో ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన టీమిండియా.. సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది.
ఆసీస్ ఇన్నింగ్స్‌లో చనకన్ బువాఖావో (34) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఈ సెమీస్ పోరులో ఆరుగురు ఆస్ట్రేలియా బ్యాటర్లు రనౌట్ అయ్యారు. భారత బౌలర్లలో సిమ్రన్‌జీత్ కౌర్, జమునా రాణి, అను కుమారి తలా వికెట్ సాధించారు.అనంతరం 110 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది.
భారత బ్యాటర్లలో బసంతి హన్సా 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. గంగా కదమ్ (41 నాటౌట్), కె. కరుణ (16 నాటౌట్) రాణించారు. ఇక ఆదివారం జరగనున్న ఫైనల్ పోరులో నేపాల్‌తో భారత్ తలపడనుంది. రెండో సెమీఫైనలో పాకిస్తాన్ ఓడించి నేపాల్ ఫైనల్‌కు అర్హత సాధించింది.
చదవండి: Bengal squad for SMAT: మహ్మద్ షమీకి చోటిచ్చిన సెలక్టర్లు.. కెప్టెన్ ఎవరంటే?


