ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025 ఫైనల్‌ల్లో సౌతాఫ్రికా జట్టు అడుగు పెట్టింది. బుధవారం నవీ ముంబై వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను 125 పరుగుల తేడాతో చిత్తు చేసిన దక్షిణాఫ్రికా.. తొలిసారి ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. 320 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మహిళల జట్టు 42.3 ఓవర్లలో కేవలం 194 పరుగలకే కుప్పకూలింది.
ఇంగ్లండ్ బ్యాటర్లలో నాట్ స్కివర్ బ్రంట్(64) టాప్ స్కోరర్‌గా నిలవగా..కాప్సీ(50), వ్యాట్(34) రాణించారు. ఇంగ్లండ్ టాపర్డర్ మొత్తం విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో కాప్ ఐదు వికెట్లతో చెలరేగగా. క్లార్క్ రెండు ,ఖాకా, లూస్ ఓ వికెట్ సాధించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగుల మేరకు భారీ స్కోర్ సాధించింది. సౌతాఫ్రికా కెప్టెన్ వోల్వార్డ్(169) సూపర్ సెంచరీతో చెలరేగింది.



