గార్డనర్ సూపర్ సెంచరీ.. న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్‌ | Gardners hundred takes Australia to 326 against New Zealand | Sakshi
Sakshi News home page

World Cup 2025: గార్డనర్ సూపర్ సెంచరీ.. న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్‌

Oct 1 2025 7:22 PM | Updated on Oct 1 2025 7:41 PM

Gardners hundred takes Australia to 326 against New Zealand

ఐసీసీ మహిళల ప్రపంచకప్‌-2025లో భాగంగా ఇండోర్‌ వేదికగా శ్రీలకంతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన కనబరిచారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 326 పరుగుల భారీ స్కోర్‌కు ఆలౌటైంది.

ఆసీస్‌ బ్యాటర్లలో స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఆష్లీ గార్డనర్ అద్బుతమైన సెంచరీతో చెలరేగారు. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను గార్డరన్‌ తన విరోచిత పోరాటంతో ఆదుకున్నారు. లోయార్డర్‌ బ్యాటర్‌ కిమ్‌ గార్త్‌తో కలిసి ఏభై పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని గార్డనర్‌ నెలకొల్పారు. 

మొత్తంగా 83 బంతులు ఎదుర్కొన్న గార్డనర్‌.. 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 115 పరుగులు చేసి ఔటయ్యారు. ఆమెతో పాటు ఫోబ్ లిచ్‌ఫీల్డ్(45), పెర్రీ(33), కిమ్‌ గార్త్‌(38) రాణించారు. స్టార్‌ ప్లేయర్లు బెత్‌ మూనీ(5), సదర్లాండ్‌(5), హీలీ(19) నిరాశపరిచారు.

న్యూజిలాండ్‌ బౌలర్లలో లియా తహుహు, జెస్‌ కేర్‌ తలా మూడు వికెట్లు సాధించగా.. ఈల్లింగ్‌, అమీలియా కేర్‌ చెరో రెండు వికెట్లు తీశారు. అయితే లక్ష్య చేధనలో వైట్‌ ఫెర్న్స్‌ జట్టు తడబడుతోంది. 0 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్‌ కష్టాల్లో పడింది.
చదవండి: IND vs AUS: ఆసీస్‌పై శ్రేయస్ అయ్యర్ విధ్వంసం.. 413 పరుగులు చేసిన భారత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement