ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా ముంబై వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో భారత బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
ఓపెనర్ షెఫాలీ వర్మ(78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 87), దీప్తి శర్మ(58 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 58 ) రాణించగా.. స్మృతి మంధాన(58 బంతుల్లో 45), రిచా ఘోష్(24 బంతుల్లో 34) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఖాకా మూడు వికెట్లు పడగొట్టగా.. ట్రయాన్, డిక్లార్క్, మబ్లా తలా వికెట్ సాధించారు.
కాగా భారత్ మహిళల ప్రపంచకప్ ఫైనల్లో అత్యధిక స్కోర్ చేసిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. ఇంతకుముందు వరల్డ్‌కప్-2022 ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఆసీస్ 356 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ 71 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ కప్ ఫైనల్‌లో ఛేదించిన అత్యధిక లక్ష్యాలపై ఓ లుక్కేద్దాం.
మహిళల వన్డే వరల్డకప్ ఫైనల్‌లో ఛేజ్ చేసిన హైయెస్ట్ టోటల్ 167గా ఉంది. 2009 వరల్డ్‌కప్‌లో నార్త్ సిడ్నీ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ ఈ లక్ష్యాన్ని చేధించింది. మహిళల ప్రపంచ కప్ ఫైనల్స్‌లో కేవలం నాలుగు మాత్రమే విజయవంతమైన రన్-ఛేజింగ్‌లు జరిగాయి. ఇప్పటివరకు జరిగిన పది ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. మరి ఇప్పుడు భారత్ అదే ఫలితాన్ని పునరావృతం చేస్తుందో లేదా సౌతాఫ్రికా చరిత్రను తిరగరాస్తుందో వేచి చూడాలి.
మహిళల ప్రపంచ కప్ ఫైనల్స్‌లో అత్యధిక లక్ష్య చేధనలు ఇవే..
| సంఖ్య | పరుగుల ఛేదన | జట్టు | ప్రత్యర్థి | ఫైనల్ సంవత్సరం |
|---|---|---|---|---|
| 1 | 167 | ఇంగ్లండ్ | న్యూజిలాండ్ | 2009 |
| 2 | 165 | ఆస్ట్రేలియా | న్యూజిలాండ్ | 1997 |
| 3 | 152 | ఆస్ట్రేలియా | ఇంగ్లండ్ | 1982 |
| 4 | 128 | ఆస్ట్రేలియా | ఇంగ్లండ్ | 1988 |


