అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం దక్షిణాఫ్రికాతో ఐదో టీ20లో తలపడేందుకు భారత జట్టు సిద్దమవుతోంది. లక్నోలో జరగాల్సిన నాలుగో టీ20.. పొగమంచు కారణంగా రద్దు కావడంతో చివరిదైన ఐదో టీ20 టీమిండియాకు కీలకంగా మారింది.
ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 3-1 తేడాతో సొంతం చేసుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది. మరోవైపు సఫారీలు కూడా ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును ఓడించి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ నిర్ణయాత్మక పోరులో టీమిండియా కొన్ని కీలక మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది.
సంజూకు లక్కీ ఛాన్స్!
ఈ మ్యాచ్‌కు భారత వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా దూరమయ్యాడు. నాలుగో టీ20కు ముందు ప్రాక్టీస్ చేస్తుండగా గిల్ పాదానికి గాయమైంది. దీంతో చివరి రెండు టీ20లకు అతడు దూరంగా ఉండనున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.
గిల్ గైర్హజరీలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తిరిగి తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అభిషేక్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్‌ను సంజూ ప్రారంభించనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు బెంచ్‌కే పరిమితమైన శాంసన్.. 2026 టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో తన ఫామ్‌ను నిరూపించుకోవడానికి ఇది మంచి అవకాశం.
బుమ్రా రీఎంట్రీ!
మరోవైపు ఈ కీలక మ్యాచ్‌కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా అందుబాటులో ఉండవచ్చు. వ్యక్తిగత కారణాల వల్ల మూడో మ్యాచ్‌కు దూరమైన అతను.. నాలుగో మ్యాచ్ సందర్భంగా జట్టుతో కలిసి కనిపించాడు. కాబట్టి ఇప్పుడు ఐదో టీ20లో అతడు ఆడే సూచనలు కన్పిస్తున్నాయి.
ఒకవేళ అతడు జట్టుతో కలిస్తే హర్షిత్ రాణా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండకపోవచ్చు. అదేవిధంగా అక్షర్ పటేల్ స్ధానంలో ప్రధాన జట్టులోకి వచ్చిన ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కకపోవచ్చు.
భారత తుది జట్టు (అంచనా):
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా/ హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్.
చదవండి: IND vs SA: క్రికెట్ వర్సెస్ కాలుష్యం.. నిజంగా ఇది సిగ్గు చేటు!


