టీమిండియా- సౌతాఫ్రికా మధ్య నాలుగో టీ20లో టాస్ ఆలస్యంగా పడనుంది. లక్నోలో పొగమంచు అధికంగా ఉన్న నేపథ్యంలో అంపైర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తిరిగి 6.50 నిమిషాలకు మరోసారి పరిస్థితిని సమీక్షించగా ఎలాంటి మార్పూ లేదు.
దీంతో 7.30 నిమిషాలకు మరోసారి రివ్యూ చేయగా.. అభిమానులకు మరోసారి నిరాశే మిగిలింది. రాత్రి 8 గంటలకు మరోసారి పరిస్థితిని పర్యవేక్షించి అందుకు అనుగుణంగా అంపైర్లు మ్యాచ్ నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు.
ఈసారి అంపైర్లు మైదానం కలియదిరుగుతూ పొగమంచు ప్రభావం ఎలా ఉందో గమనించారు. బ్యాటర్, బౌలర్, ఫీల్డర్ల పొజిషన్ల నుంచి బంతి స్పష్టంగా కనబడుతుందా? లేదా? అన్న విషయాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో చర్చల అనంతరం 8.30 నిమిషాలకు మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
రీప్లేస్‌మెంట్‌గా షాబాజ్ అహ్మద్
కాగా ఈ మ్యాచ్‌కు ముందు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ టీమిండియాకు దూరమయ్యాడు. అనారోగ్యం కారణంగా మిగిలిన రెండు టీ20ల నుంచి అతడు తప్పుకోగా.. బీసీసీఐ షాబాజ్ అహ్మద్‌ను రీప్లేస్‌మెంట్‌గా ప్రకటించింది. అదే విధంగా వ్యక్తిగత కారణాలతో మూడో టీ20కి దూరమైన పేస్ దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రా తిరిగి వచ్చాడు. నాలుగో టీ20లో అతడు బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు.
ఇదిలా ఉంటే.. ఐదు టీ20 సిరీస్‌ల భాగంగా కటక్‌లో తొలి మ్యాచ్‌లో భారత్ 101 పరుగులతో గెలవగా.. ముల్లన్‌పూర్‌లో సౌతాఫ్రికా 51 పరుగులతో గెలిచింది. తద్వారా 1-1తో సిరీస్ సమం చేసింది.
అయితే, ధర్మశాలలో మరోసారి జయభేరి మోగించిన టీమిండియా 2-1తో ఆధిక్యంలోకి దూసుకువచ్చింది. లక్నో వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లోనూ గెలిచి.. మరో టీ20 మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని సూర్య సేన పట్టుదలగా ఉంది. అంతకు ముందు టెస్టుల్లో సఫారీలు టీమిండియాను 2-0తో వైట్‌వాష్ చేయగా.. వన్డే సిరీస్‌ను భారత్ 2-1తో గెలుచుకుంది.


