
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025లో బంగ్లాదేశ్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్‌న పాకిస్తాన్‌తో తలపడేందుకు సిద్దమైంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్ మహిళల జట్టుకు ఊహించని షాక్ తగలింది. ఆ జట్టు హెడ్ కోచ్ సర్వర్ ఇమ్రాన్ బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యాడు.
అతడిని సోమవారం అస్పత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. ఈ వార్త కాస్త ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది ఈ విషయాన్ని బంగ్లా టీమ్ మేనేజర్ ఎస్ఎం గోలం ఫయాజ్ ధృవీకరించారు. "ఇమ్రాన్ సర్వర్‌కు కొన్ని రోజుల క్రితం తల తిరుగుతున్నట్లు అన్పించింది. సోమవారం ఆయనకు ఆ సమస్య ఎక్కువైంది.
వెంటనే సర్వర్‌ను అస్పత్రికి తీసుకెళ్లాము. సీటీ స్కాన్‌లో అతడికి స్వల్ప బ్రెయిన్ స్ట్రోక్ ఉందని వైద్యులు గుర్తించారు" అని ఫయాజ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఇమ్రాన్ అస్పత్రి నుంచి మంగళవారం డిశ్చార్జ్ అయ్యాడు. అతడు ప్రస్తుతం టీమ్ హోటల్‌లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు అతడు టీమ్‌తో కలవనున్నట్లు తెలుస్తోంది. కాగా శ్రీలంక మాజీ కెప్టెన్ హషన్ తిలకరత్నే స్థానంలో ఇమ్రాన్ ఈ ఏడాది ఆరంభంలో బంగ్లా మహిళల జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. 66 ఏళ్ల ఇమ్రాన్‌కు బంగ్లాదేశ్ క్రికెట్‌లో ప్రత్యేక స్ధానం ఉంది.
2000లో బంగ్లాదేశ్ పురుషుల జట్టు తొలి టెస్ట్ మ్యాచ్‌లో కోచ్‌గా అతడు పనిచేశాడు. అతడి గైడెన్స్‌లోనే బంగ్లాదేశ్ మహిళల జట్టు ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌నకు అర్హత సాధించింది. బంగ్లాదేశ్ ఈ మెగా టోర్నమెంట్‌లో పాల్గొనడం ఇది రెండవసారి. ప్రధాన టోర్నీలో కూడా సత్తాచాటాలని బంగ్లా జట్టు ఉవ్విళ్లూరుతోంది.
ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్ జట్టు
నిగర్ సుల్తానా జోటీ (కెప్టెన్), నహిదా అక్టర్ (వైస్ కెప్టెన్), ఫర్జానా హక్, రుబ్యా హైదర్ ఝెలిక్, షర్మిన్ అక్తర్ సుప్తా, శోభనా మోస్తరీ, రీతు మోని, షోర్నా అక్తర్, ఫాహిమా ఖాతున్, రబెయా ఖాన్, మరుఫా అక్తర్, ఫరీహా ఇస్లాం త్రిస్నా, మరుఫా అక్తర్, ఫరీహా ఇస్లాం త్రిస్నా, షంజిదా అక్తర్, నిషితా అక్టర్ నిషి, సుమయ్యా అక్టర్