ఇదేందయ్యా ఇది.. ఇంత చెత్త ఫీల్డింగ్‌!.. గొప్పలకేమీ తక్కువలేదు | Pak Missed Run Out Chance Against Bangladesh Video Goes Viral, Despite Securing Asia Cup 2025 Final Spot | Sakshi
Sakshi News home page

PAK Vs BAN: ఇదేందయ్యా ఇది.. ఇంత చెత్త ఫీల్డింగ్‌!.. గొప్పలకేమీ తక్కువలేదు

Sep 26 2025 10:27 AM | Updated on Sep 26 2025 10:46 AM

Pak Fielders Act Stuns All Bangladesh Batters Avoid Easy Run Out Video

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా పాకిస్తాన్‌ చెత్త ఫీల్డింగ్‌తో విమర్శల పాలైంది. ఇద్దరు బ్యాటర్లు ఒకే ఎండ్‌లో ఉండీ.. అప్పటికి ఫీల్డర్‌ బంతిని తన చేతుల్లోకి తీసుకున్నా.. రనౌట్‌ చేసే సువర్ణావకాశాన్ని మిస్‌ చేసుకుంది. ఎట్టకేలకు పదకొండు పరుగుల తేడాతో గట్టెక్కడం వల్ల సరిపోయింది గానీ లేదంటే.. ఈ చెత్త ఫీల్డింగ్‌ కారణంగా పాక్‌ ఫైనల్‌ అవకాశం చేజారేదే!

అసలేం జరిగిందంటే.. ఆసియా టీ20 కప్‌-2025 సూపర్‌-4లో చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ గురువారం బంగ్లాదేశ్‌ (PAK vs BAN)తో తలపడింది. దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బంగ్లా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

ఫైనల్‌కు అర్హత
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పాక్‌.. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. మొహమ్మద్‌ హ్యారిస్‌ (31), మొహమ్మద్‌ నవాజ్‌ (25) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 124 పరుగులకే పరిమితమైంది. దీంతో పదకొండు పరుగుల తేడాతో పాక్‌ గెలుపొంది.. ఫైనల్‌కు అర్హత సాధించింది.

అయితే, బంగ్లా ఇన్నింగ్స్‌లో ఐదో ఓవర్లో షాహిన్‌ ఆఫ్రిది బంతితో రంగంలోకి దిగగా.. తొలి బంతిని తౌహీద్‌ హృదయ్‌ (Towhid Hridoy) ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో బంతిని గాల్లోకి లేపగా.. బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ దిశగా వెళ్లింది. దీంతో అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న సయీమ్‌ ఆయుబ్‌ (Saim Ayub) బంతిని బౌండరీకి వెళ్లకుండా ఆపాడు.

రనౌట్‌ అవకాశం మిస్‌
కానీ అప్పటికే మరో ఎండ్‌లో ఉన్న సైఫ్‌ హసన్‌ తౌహీద్‌ హృదయ్‌ వైపు పరుగెత్తాడు. ఈ క్రమంలో ఇ‍ద్దరూ స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉండగా.. ఆయుబ్‌ బౌలర్‌ ఎండ్‌ వైపు బంతిని విసిరాడు. అయితే, మిస్‌ ఫీల్డ్‌ అయింది. బంతిని అందుకోవడానికి అక్కడ ఎవరూ లేరు. మిడాన్‌లో ఉన్న ఫీల్డర్‌ వచ్చి బంతిని అందుకోవాల్సి వచ్చింది.

ఇంతలో సైఫ్‌ వేగంగా తన స్థానంలోకి వచ్చేశాడు. దీంతో రనౌట్‌ అవకాశం మిస్సవగా.. ఆయుబ్‌ ముఖం మాడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్‌పై విజయం తర్వాత పాక్‌ కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా మాట్లాడుతూ.. తమ ఫీల్డింగ్‌ అద్భుతమంటూ కొనియాడాడు.

గొప్పలకు మాత్రం ఏం తక్కువ లేదు
ఈ నేపథ్యంలో రనౌట్‌ చాన్స్‌ మిస్‌ చేసిన ఈ వీడియోను షేర్‌ చేస్తూ.. ‘‘చెత్త ఫీల్డింగ్‌.. గొప్పలకు మాత్రం ఏం తక్కువ లేదు’’ అంటూ నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే.. పాక్‌ ఫీల్డర్ల కారణంగా లైఫ్‌ పొందిన బంగ్లా ఓపెనర్‌ సైఫ్‌ హసన్‌ 18 పరుగులే చేయగలిగాడు. మరోవైపు.. తౌహీద్‌ హృదయ్‌ (5) కూడా ఫెయిలయ్యాడు. షమీమ్‌ హొసేన్‌ (30) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ఇక బంగ్లాపై గెలిచిన పాక్‌.. సెప్టెంబరు 28న టీమిండియాతో ఫైనల్లో తలపడుతుంది.

చదవండి: సూర్య... అలాంటి వ్యాఖ్యలొద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement