ఆసియాకప్-2025లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లలో ఓవరాక్షన్ చేసిన పాకిస్తాన్ స్పీడ్ స్టార్ హారిస్ రవూఫ్‌కు ఐసీసీ భారీ షాకిచ్చింది. రవూఫ్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విధించింది. ఈ మెగా టోర్నీలో రవూఫ్ రెండు సార్లు తమ ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది.
అసలేమి జరిగింగదంటే?
ఆసియాకప్‌లో భాగంగా లీగ్ స్టేజిలో సెప్టెంబర్ 14న భారత్-పాక్ జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మలను రవూఫ్ దుర్భాషలాడాడు. అంతేకాకుండా వారితో పాక్ పేసర్ వాగ్వాదానికి దిగాడు. దీంతో అతడి మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా ఐసీసీ విధించింది.
అదేవిధంగా రెండు డిమెరిట్ పాయింట్లు కూడా అతడి ఖాతాలో చేరాయి. అయినా కూడా రవూఫ్ ప్రవర్తన ఏ మాత్రం మారలేదు. సూపర్-4 మ్యాచ్‌లో రవూఫ్ తన వక్రబుద్దిని చాటుకున్నాడు. ఫీల్డింగ్ చేస్తుండగా భారత అభిమానులు కోహ్లి కోహ్లి అని అరవగా.. అందుకు బదులుగా రవూఫ్ భారత్‌కు చెందిన 6 రఫెల్ జెట్ ఫ్లైట్స్‌ను కూల్చామని, యుద్దంలో తమదే విజయమని పేర్కొంటూ 6-0 సంజ్ఞలు చేశాడు.
#Indian are crying because #HarisRauf trolled 1000s of them alone . pic.twitter.com/hx8qACIBm2
— Zeitung (@Himat75) September 22, 2025
దీంతో మళ్లీ అతడి మ్యాచ్ ఫీజులో 30 శాతం కోతను ఐసీసీ విధించింది. మళ్లీ రెండు డిమెరిట్ పాయింట్లు ఇవ్వబడ్డాయి. మొత్తంగా అతడి ఖాతాలో నాలుగు డిమెరిట్ పాయింట్లు వచ్చి చేరాయి. అయితే 24 నెలల వ్యవధిలో 4 లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లు పొందితే.. ఐసీసీ సదరు ఆటగాడిపై ఒక టెస్ట్ మ్యాచ్ లేదా రెండు వన్డేలు లేదా రెండు టీ20ల నిషేధం విధిస్తుంది. ఈ కారణాంగానే ఫైసలాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేకు రవూఫ్ దూరమయ్యాడు.
సూర్యకు షాక్..
అదేవిధంగా లీగ్ స్టేజిలో పాకిస్తాన్‌పై సాధించిన విజయాన్ని ఫహల్గాం ఉగ్రదాడి బాధితులు, సైనికులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించిన భారత కెప్టెన్ సూర్యకుమార్‌పై కూడా ఐసీసీ చర్యలు తీసుకుంది. సూర్యకుమార్ యాదవ్‌కు మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానాతో పాటు రెండు డీమెరిట్ పాయింట్లు కూడా విధించబడ్డాయి. సూర్య ఖాతాలో మరో రెండు డీమెరిట్ పాయింట్లు చేరితే 2 మ్యాచ్‌ల నిషేదం ఎదుర్కొక తప్పదు. అదేవిధంగా హ్యారిస్ రవూఫ్‌కు జెట్ విమానం కూలినట్లగా సైగ చేసిన జస్ప్రీత్ బుమ్రాను కూడా ఐసీసీ మందలించింది.


