అండర్-19 ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగింది. పాక్ మాత్రం ఒక్క మార్పు చేసింది.
డానియల్ అలీ ఖాన్ స్ధానంలో నిఖాబ్ షఫీక్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఓటమెరుగని టీమిండియా.. తుది పోరులో కూడా తమ జోను కొనసాగించాలని పట్టుదలతో ఉంది. వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, అభిజ్ఞాన్ కుందు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో కూడా దీపేష్ దేవేంద్రన్, కిషన్ కుమార్ సింగ్ దుమ్ములేపుతున్నారు.
తుది జట్లు
పాకిస్తాన్: సమీర్ మిన్హాస్, ఉస్మాన్ ఖాన్ , అహ్మద్ హుస్సేన్, ఫర్హాన్ యూసఫ్ (కెప్టెన్), హంజా జహూర్ (వికెట్ కీపర్), హుజైఫా అహ్సాన్, నికాబ్ షఫీక్, మహ్మద్ షయాన్, అలీ రజా, అబ్దుల్ సుభాన్, మహ్మద్ సయామ్
భారత్: ఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్, కిషన్ కుమార్ సింగ్


