breaking news
Run Out Scare
-
ఇదేందయ్యా ఇది.. ఇంత చెత్త ఫీల్డింగ్!.. గొప్పలకేమీ తక్కువలేదు
బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ చెత్త ఫీల్డింగ్‌తో విమర్శల పాలైంది. ఇద్దరు బ్యాటర్లు ఒకే ఎండ్‌లో ఉండీ.. అప్పటికి ఫీల్డర్ బంతిని తన చేతుల్లోకి తీసుకున్నా.. రనౌట్ చేసే సువర్ణావకాశాన్ని మిస్ చేసుకుంది. ఎట్టకేలకు పదకొండు పరుగుల తేడాతో గట్టెక్కడం వల్ల సరిపోయింది గానీ లేదంటే.. ఈ చెత్త ఫీల్డింగ్ కారణంగా పాక్ ఫైనల్ అవకాశం చేజారేదే!అసలేం జరిగిందంటే.. ఆసియా టీ20 కప్-2025 సూపర్-4లో చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ గురువారం బంగ్లాదేశ్ (PAK vs BAN)తో తలపడింది. దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఫైనల్‌కు అర్హతఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. మొహమ్మద్ హ్యారిస్ (31), మొహమ్మద్ నవాజ్ (25) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 124 పరుగులకే పరిమితమైంది. దీంతో పదకొండు పరుగుల తేడాతో పాక్ గెలుపొంది.. ఫైనల్‌కు అర్హత సాధించింది.అయితే, బంగ్లా ఇన్నింగ్స్‌లో ఐదో ఓవర్లో షాహిన్ ఆఫ్రిది బంతితో రంగంలోకి దిగగా.. తొలి బంతిని తౌహీద్ హృదయ్ (Towhid Hridoy) ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో బంతిని గాల్లోకి లేపగా.. బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా వెళ్లింది. దీంతో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న సయీమ్ ఆయుబ్ (Saim Ayub) బంతిని బౌండరీకి వెళ్లకుండా ఆపాడు.రనౌట్ అవకాశం మిస్కానీ అప్పటికే మరో ఎండ్‌లో ఉన్న సైఫ్ హసన్ తౌహీద్ హృదయ్ వైపు పరుగెత్తాడు. ఈ క్రమంలో ఇద్దరూ స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా.. ఆయుబ్ బౌలర్ ఎండ్ వైపు బంతిని విసిరాడు. అయితే, మిస్ ఫీల్డ్ అయింది. బంతిని అందుకోవడానికి అక్కడ ఎవరూ లేరు. మిడాన్‌లో ఉన్న ఫీల్డర్ వచ్చి బంతిని అందుకోవాల్సి వచ్చింది.ఇంతలో సైఫ్ వేగంగా తన స్థానంలోకి వచ్చేశాడు. దీంతో రనౌట్ అవకాశం మిస్సవగా.. ఆయుబ్ ముఖం మాడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్‌పై విజయం తర్వాత పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా మాట్లాడుతూ.. తమ ఫీల్డింగ్ అద్భుతమంటూ కొనియాడాడు.గొప్పలకు మాత్రం ఏం తక్కువ లేదుఈ నేపథ్యంలో రనౌట్ చాన్స్ మిస్ చేసిన ఈ వీడియోను షేర్ చేస్తూ.. ‘‘చెత్త ఫీల్డింగ్.. గొప్పలకు మాత్రం ఏం తక్కువ లేదు’’ అంటూ నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే.. పాక్ ఫీల్డర్ల కారణంగా లైఫ్ పొందిన బంగ్లా ఓపెనర్ సైఫ్ హసన్ 18 పరుగులే చేయగలిగాడు. మరోవైపు.. తౌహీద్ హృదయ్ (5) కూడా ఫెయిలయ్యాడు. షమీమ్ హొసేన్ (30) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ఇక బంగ్లాపై గెలిచిన పాక్.. సెప్టెంబరు 28న టీమిండియాతో ఫైనల్లో తలపడుతుంది.చదవండి: సూర్య... అలాంటి వ్యాఖ్యలొద్దుBoth batters at the same end but still survive 😲Watch #PAKvBAN Live now on the Sony Sports Network TV channels Sony LIV. #SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/b6tXLSMI1d— Sony Sports Network (@SonySportsNetwk) September 25, 2025 -
'మిస్టర్ కూల్'లో ఈ తీవ్ర ఆగ్రహాన్ని చూశారా?
'మిస్టర్ కూల్' మహేంద్రసింగ్ ధోనీ మరోసారి తన 'మ్యాజికల్ ఇన్నింగ్స్'తో భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఇటు ధోని (88 బంతుల్లో 79; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), అటు హార్దిక్ పాండ్యా (66 బంతుల్లో 83; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) రాణించడంతో భారత్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో హాఫ్ సెంచరీల సెంచరీ కొట్టిన క్రికెటర్‌గా ధోనీ ఘనత సొంతం చేసుకున్నారు. గతంలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ తదితర భారత క్రికెటర్లు ఈ ఘనత సొంతం చేసుకున్నారు. కానీ, ధోనీని ప్రారంభంలోనే రన్నౌట్ చేసే అవకాశాన్ని ఆస్ట్రేలియా చేజార్చుకుంది. కేదార్ జాధవ్ అజాగ్రత్త వల్ల ధోనీ రన్నౌట్ అయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొన్నాడు. కానీ, అదృష్టం బాగుండి తృటిలో బయటపడటం.. టీమిండియాకు కలిసొచ్చింది. ఈ సమయంలో ప్రశాంతతకు మారుపేరుగా ఉండే ధోనీ ఒక్కసారిగా తనలోని ఉగ్రరూపాన్ని చూపెట్టాడు. కేదార్ జాధవ్‌ను ఉరిముతూ చూడటం కెమెరా కంటపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కష్టాల్లో ఉన్న సమయంలో ధోనీ బ్యాటింగ్‌కు వచ్చాడు. 22వ ఓవర్లో ధోనీ 7 పరుగుల వద్ద ఉండగా రన్నౌట్ అయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొన్నాడు. బంతిని కవర్ దిశగా మళ్లించిన ధోనీ వెంటనే పరుగుకు ఉపక్రమించాడు. కానీ, మరో ఎండ్‌లో ఉన్న కేదార్ జాదవ్ మాత్రం స్పందించలేదు. దీంతో మైదానంలో మధ్యలోకి వెళ్లిన ధోనీ కాస్తా తడబడి.. తిరిగి వెనక్కి మళ్లే ప్రయత్నంచేశాడు. ఇంతలో బంతి అందుకున్న హిల్టన్ కార్ట్‌రిట్ హడావిడిగా వికెట్ల వైపు బంతి విసిరాడు. బంతి కాస్తా వికెట్లను తాకకుండా ఓవర్ త్రో అయింది. దీంతో ధోనీ పరుగు తీశాడు. కానీ పరుగు తీసిన అనంతరం కేదార్‌ను ధోనీ ఉరుముతూ ఆవేశంతో చూశాడు. ఇదేమీ తీరు అన్నట్టు తల పంకించాడు. ఆ వెంటనే 40 పరుగులు చేసిన కేదార్ మార్కస్ బౌలింగ్‌లో కార్ట్రిట్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడం గమనార్హం. కానీ, 'మిస్టర్ కూల్' ధోనీ ఇలా ఉగ్రరూపంతో చూడటం అభిమానుల దృష్టి ఆకర్షించింది. ధోనీ ఎంత కోపంగా చూశాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.