PC: X
ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) ఓ పొరపాటు చేశాడు. అతడి ఫీల్డింగ్ వైఫల్యం కారణంగా ఆసీస్ వన్‌డౌన్ బ్యాటర్ మాథ్యూ షార్ట్ (Matthew Short)ను త్వరగా పెవిలియన్‌కు పంపే అవకాశాన్ని భారత్ కోల్పోయింది. అసలేం జరిగిందంటే..
ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను ఆసీస్ (IND vs AUS)కు కోల్పోయిన టీమిండియా సిడ్నీ వేదికగా నామమాత్రపు ఆఖరి వన్డేలో.. టాస్ ఓడి తొలుత బౌలింగ్‌కు దిగింది. ఈ క్రమంలో ఆసీస్ ఓపెనర్లు మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ ఆది నుంచే బౌండరీలు బాదుతూ పరుగులు పిండుకున్నారు.
డైరెక్ట్ త్రో మిస్ చేసిన గిల్
ఈ జోడీని విడదీసేందుకు భారత బౌలర్లు గట్టిగానే ప్రయత్నించగా.. మొహమ్మద్ సిరాజ్ సఫలమయ్యాడు. ఆసీస్ ఇన్నింగ్స్ పదో ఓవర్లో రెండో బంతికి డేంజరస్ బ్యాటర్ హెడ్ (29)ను పెవిలియన్‌కు పంపాడు. ఈ క్రమంలో మాథ్యూ షార్ట్ క్రీజులోకి వచ్చాడు. పదో ఓవర్లో సిరాజ్ వేసిన మూడో బంతికి అతడు పరుగులు రాబట్టలేకపోయాడు.
ఫ్రంట్ ఫుట్ డిఫెండ్ షాట్‌తో సేవ్ అయ్యాడు. అయితే, సిరాజ్ సంధించిన నాలుగో బంతిని షార్ట్.. షార్ట్ కవర్ దిశగా బాదాడు. ఈ క్రమంలో మిడాఫ్ నుంచి పరిగెత్తుకు వచ్చిన ఫీల్డర్ గిల్ బంతిని అందుకున్నా.. దానిని సమర్థవంతంగా వికెట్లకు గిరాటేయడంలో విఫలమయ్యాడు. ఈజీ డైరెక్ట్ త్రోకు ఆస్కారం ఉన్నా గిల్ మిస్‌ఫీల్డ్ కారణంగా టీమిండియా రనౌట్ చేసే అవకాశాన్ని కోల్పోయింది.
Can't Bat
Can't Bowl
Can't Field
Can't Captain
What does Shubman Gill even do? pic.twitter.com/1tftX7250A— ADITYA (@Wxtreme10) October 25, 2025
రవిశాస్త్రి ఫైర్
అప్పటికే సింగిల్‌కు వచ్చిన షార్ట్ నాన్ స్ట్రైకర్ ఎండ్‌లోకి చేరుకోగా.. నిరాశగా స్టంప్స్ వైపు వచ్చిన సిరాజ్ అదుపు తప్పి షార్ట్‌పై పడిపోయాడు. మరోవైపు.. మార్ష్ కూడా సర్వైవ్ అయ్యాడు. ఈ ఘటన గురించి కామెంటేటర్ .. ‘‘ఇదొక మిక్స్ అప్. రనౌట్ చేసే అవకాశం మిస్సయ్యారు’’ అని పేర్కొనగా.. రవిశాస్త్రి.. ‘‘అవును.. అతడికి చాలా సమయం ఉన్నా సరైన విధంగా హిట్ చేయలేకపోయాడు’’ అని గిల్‌ను విమర్శించాడు.
ఇదిలా ఉంటే.. సున్నా వద్ద లైఫ్ పొందిన షార్ట్ 30 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మరోవైపు మార్ష్ (41) అక్షర్ పటేల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. 33 ఓవర్ల ఆట ముగిసేసరికి ఆసీస్ మూడు వికెట్ల నష్టానికి 178పరుగులు చేసింది. అలెక్స్ క్యారీ 24, మ్యాట్ రెన్షా 46 పరుగులతో ఉన్నారు.
చదవండి: IND vs AUS 3rd ODI: నితీశ్ రెడ్డి అవుట్.. కారణం వెల్లడించిన బీసీసీఐ
A classic Axar Patel delivery! 🔥
The Aussie skipper heads back, and #TeamIndia are right back in the contest! 🇮🇳👏#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuANAu pic.twitter.com/BDrWFPLvgs— Star Sports (@StarSportsIndia) October 25, 2025


