
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ (New Zealand vs Australia) కోసం ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (అక్టోబర్ 1) తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా (Australia) 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ (New Zealand) నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఈ స్కోర్ చేయడానికి యువ ఆటగాడు టిమ్ రాబిన్సన్ (Tim Robinson) ప్రధాన కారకుడు.
6 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో రాబిన్సన్ మెరుపు శతకంతో (66 బంతుల్లో 106 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. అతనికి డారిల్ మిచెల్ (34), బెవాన్ జాకబ్స్ (20) కాసేపు సహకరించారు.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో టిమ్ సీఫర్ట్ (4), డెవాన్ కాన్వే (1),మార్క్ చాప్‌మన్ (0), మైఖేల్ బ్రేస్‌వెల్ (7) దారుణంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో డ్వార్షుయిస్ 2, హాజిల్‌వుడ్, మాథ్యూ షార్ట్ తలో వికెట్ తీశారు.
అనంతరం 182 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ తొలి బంతి నుంచే ఎదురుదాడి ప్రారంభించింది. ఓపెనర్లు ట్రివిస్ హెడ్ (18 బంతుల్లో 31; 6 ఫోర్లు), మిచెల్ మార్ష్ (43 బంతుల్లో 85; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ షాట్లు ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.
67 పరుగుల వద్ద హెడ్ ఔటైనా మార్ష్.. షార్ట్ (29) సాయంతో మెరుపులు కొనసాగించాడు. టిమ్ డేవిడ్ (12 బంతుల్లో 21 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు), స్టోయినిస్ (4 నాటౌట్) ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చారు. ఆసీస్ కేవలం 16.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.
న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 2, జకరీ ఫౌల్క్స్, కైల్ జేమీసన్ తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో ఆసీస్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టీ20 అక్టోబర్ 3న జరుగనుంది.
చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. సరికొత్త ప్రపంచ రికార్డు