న్యూ ఇయర్‌కు గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెబుతూ.. | Happy New Year 2026: Few Countries Celebrate New Year Before India | Sakshi
Sakshi News home page

భారత్‌ కంటే ముందు న్యూ ఇయర్‌ సెలట్రేట్‌ చేసుకునే దేశాలు..!

Dec 31 2025 4:50 PM | Updated on Dec 31 2025 5:03 PM

Happy New Year 2026: Few Countries Celebrate New Year Before India

సంవత్సరపు చివరి క్షణాలు మనసులో జ్ఞాపకాల ముత్యాలు చల్లుతూ.. కొత్త ఆశలతో నిండిన ఉదయం వైపు ప్రపంచం అడుగులు వేస్తోంది. పాతది మసకబారుతుంటే, కొత్తది వెలుగులు విరజిమ్ముతోంది.  న్యూ ఇయర్‌కు కొత్త ఉదయం తలుపులు తడుతుంటే.. ఇప్పటి వరకూ మనం ఆస్వాదించిన ఇయర్‌-2025 ముగింపునకు సిద్ధంగా ఉంది. 

అయితే ఇప్పటికే పలు దేశాల్లో కొత్త ఏడాది  ఉదయించింది’. ప్రపంచంలో అన్నింటికి కంటే ముందు సూర్యుడు ఉదయించే దేశాల్లో పసిఫిక్‌ మహాసముద్ర తీర ప్రాంత దేశాలు ముందు వరుసలో ఉంటాయి. అందులో కిరిబాటి అనే ద్వీప దేశం ఒకటి.  అలాగే న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో కొత్త ఏడాది ప్రారంభమైంది.   ప్రస్తుతం అక్కడి జనవరి 1 వచ్చేసింది కాబట్టి వారు కొత్త సంవత్సరం వేడుకల్లోకి ప్రవేశించారు.

కిరిబాటి.. చిన్న ద్వీప దేశం
భూమిపై ప్రకృతి సౌందర్యం, ప్రజలు తక్కువగా ఉన్న ప్రదేశాల్లో  ఇది ఒకటి.  ప్రపంచంలోని అత్యుత్తమ ప్రదేశాల టాప్‌-10 జాబితాలో కూడా ఈ ద్వీప దేశానికి చోటు ఉండటం విశేషం.  ఇది పసిఫిక్ మహాసముద్రం మధ్యలో, న్యూజిలాండ్‌కు ఉత్తరాన ఉంది. 

సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే క్రమంలో ఆ భానుడి లేలేత కిరణాలు కిరిబాటి అనే చిన్న దేశం మీద ముందుగా పడతాయి. అంటే  ఈ దేశమే ముందు నిద్ర లేస్తుంది అన్నమాట. ఇదొక ద్వీప దేశం. దీని జనాభా చాలా తక్కువ.ఇక్కడ జనాభా 1.34 లక్షలు అని ఒక అంచనా. మన లెక్కన ఒక అసెంబ్లీ నియోజవర్గం ఓటర్ల సంఖ్య కంటే చిన్న దేశం ఇది. భారత్‌లో డిసెంబర్‌ 31(3.30 PM) సూర్యుడు అస్తమించే సమయంలో అక్కడ జనవరి 1వ తేదీ వచ్చేస్తుంది. భారత్‌కు కిరిబాటికి ఇంచుమించు 8.30 గంటల సమయం వ్యత్యాసం ఉంది.

భారత్‌లో ( 12 am అయిన సందర్భంలో)కొత్త ఏడాది ప్రారంభం కావడానికంటే ముందే  నూతన సంవత్సరం జరుపుకునే పలు దేశాల జాబితా వరుస క్రమంలో..

  • కిరిబాటి(8.30 am on Jan 1)

  • సమోవా, టోంగా((7.30 am on Jan 1)

  • న్యూజిలాండ్‌((7.30 am on January 1)

  • రష్యా, ఫిజి((6.30 am on January 1)

  • ఆస్ట్రేలియా((5.30 am on January 1)

  • పాపువా న్యూగినియా((4.30 am on January 1)

  • ఇండోనేషియా, జపాన్‌, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా( 1.30 am on January 1)

  • చైనా, మలేషియా, సింగపూర్‌(2.30 am on January 1)

  • వియాత్నాం, థాయ్‌లాండ్‌( 1.30 am on January 1)

  • మయన్మార్‌(1 am on January 1)

  • బంగ్లాదేశ్‌, కజికిస్తాన్‌, భూటాన్‌( 12.30 am on January 1)

  • నేపాల్‌(12.15 am on January 1)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement