మహిళల ప్రీమియర్ లీగ్-2026 సీజన్ ఆరంభానికి ముందు గుజరాత్ జెయింట్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ యస్తికా భాటియా గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమైంది. డబ్ల్యూపీఎల్-2026 వేలంలో యస్తికాను రూ.50 లక్షలకు గుజరాత్ కొనుగొలు చేసింది. అయితే వేలానికి ముందే యస్తికా మోకాలి గాయంతో బాధపడతోంది
కానీ డబ్ల్యూపీఎల్ ఆరంభ సమయానికి యస్తిక ఫిట్‌నెస్ సాధిస్తుందని గుజరాత్ భావించింది. కానీ ఆమె పూర్తిగా కోలుకోవడానికి మరో నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే డబ్ల్యూపీఎల్ నుంచి భాటియా వైదొలిగింది. ఈ విషయాన్ని గుజరాత్ సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది.
ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు గుజరాత్ ఓ వీడియో రిలీజ్ చేసింది. కాగా యస్తికా గాయం కారంణంగా వన్డే వరల్డ్‌కప్-2025కు కూడా దూరమైన సంగతి తెలిసిందే. ఆమో స్ధానంలో ఉమా ఛెత్రీని జట్టులోకి తీసుకున్నారు. అయితే గుజరాత్ జెయింట్స్‌కు యస్తికా స్ధానాన్ని మరొక ప్లేయర్‌తో భర్తీ చేసే అవకాశం లేదు.
బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ఒక ప్లేయర్ వేలానికి ముందే గాయపడి ఉన్నప్పటికి జట్టులోకి తీసుకుంటే.. తర్వాత గాయం కారణంగా దూరమైతే వారి స్ధానంలో వేరే ప్లేయర్‌ను ఎవరినీ తీసుకోవడానికి వీలుండదు. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశముంది.
స్టార్ ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ కూడా ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు. ఇక డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో నవీ ముంబై వేదికగా ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ ఉమెన్స్ జట్లు తలపడనున్నాయి.
గుజరాత్ జెయింట్స్ జట్టు
యాష్లే గార్డనర్, డానీ వ్యాట్-హాడ్జ్, భారతి ఫుల్మాలి, అనుష్క శర్మ,సోఫీ డివైన్, జార్జియా వేర్హామ్, కిమ్ గార్త్, కనికా అహుజా, తనూజా కన్వర్,యుషి సోని, బెత్ మూనీ, యస్తికా భాటియా, శివాని సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, కాశ్వి గౌతమ్, రాజేశ్వరి గైక్వాడ్, టైటాస్ సాధు, హ్యాపీ కుమారి


