breaking news
Yastika Bhatia
-
విజయం దిశగా భారత్
లండన్: చారిత్రక టెస్టు మ్యాచ్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు భారీ విజయానికి చేరువైంది. ‘క్రికెట్ మక్కా’ లార్డ్స్‌లో జరుగుతున్న తొలి మహిళల సుదీర్ఘ ఫార్మాట్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు ఆతిథ్య ఇంగ్లండ్‌పై సంపూర్ణ ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఓవర్‌నైట్ స్కోరు 154/1తో ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 86.3 ఓవర్లలో 341/7 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ యస్తిక భాటియా (113; 14 ఫోర్లు) లార్డ్స్ మైదానంలో సెంచరీ చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పగా... స్మృతి మంధాన (70; 9 ఫోర్లు, 1 సిక్స్), రిచా ఘోష్ (50 నాటౌట్; 8 ఫోర్లు) అర్ధశతకాలు సాధించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఎకిల్‌స్టోన్ 5 వికెట్లు పడగొట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం 115 పరుగులు కలుపుకొని ప్రత్యర్థి ముందు భారత జట్టు 457 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కొండంత లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. భారత బౌలర్లలో క్రాంతి, సయాలి, స్నేహ్ రాణా తలా రెండు వికెట్లు తీశారు. చేతిలో 4 వికెట్లు ఉన్న ఇంగ్లండ్ విజయానికి ఇంకా 327 పరుగులు చేయాల్సి ఉంది. నేడు మ్యాచ్‌కు చివరి రోజు. -
చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్
చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో భారత మహిళల క్రికెట్ జట్టు వికెట్‌కీపర్-బ్యాటర్ యస్తిక భాటియా చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మూడో రోజు ఆటలో అద్భుత సెంచరీ సాధించింది. తద్వారా లార్డ్స్‌లో తొలి టెస్ట్ శతకం నమోదు చేసిన మహిళా బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పింది. ఈ ఘనతతో ప్రతిష్ఠాత్మక లార్డ్స్ ఆనర్స్ బోర్డులో తన పేరును చిరస్థాయిగా లిఖించుకుంది.మూడో రోజు స్మృతి మంధానతో కలిసి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన యస్తిక, ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంది. మంధానా 70 పరుగుల వద్ద ఔటైన తర్వాత ఇన్నింగ్స్‌ను చక్కగా నిర్మిస్తూ భారత్ ఆధిక్యాన్ని 350 పరుగులు దాటించడంలో కీలక పాత్ర పోషించింది.భోజన విరామ సమయానికి 99 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన యస్తిక, విరామం అనంతరం కేవలం ఆరు బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసింది. ఇస్సీ వాంగ్ వేసిన 68వ ఓవర్ చివరి బంతిని కవర్స్ వైపు సింగిల్ తీసి 145 బంతుల్లో తన తొలి టెస్టు సెంచరీని అందుకుంది.ఈ సెంచరీతో యస్తిక మరో అరుదైన రికార్డును కూడా నెలకొల్పింది. లార్డ్స్‌లో టెస్టు సెంచరీ చేసిన రెండో భారత ఎడమచేతి బ్యాటర్‌గా (పురుషులు, మహిళలు) నిలిచింది. 1996లో తన అరంగేట్రం టెస్టులో సౌరవ్ గంగూలీ చేసిన 131 పరుగుల తర్వాత ఈ ఘనత సాధించిన తొలి భారత ఎడమచేతి బ్యాటర్ యస్తికనే.ఇదే మ్యాచ్‌లో భారత యువ పేసర్ క్రాంతి గౌడ్ కూడా ఆనర్స్ బోర్డులో తన పేరు లిఖించుకుంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌తో ఆమె ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసి ఈ ఘనత సాధించింది.మ్యాచ్ విషయానికొస్తే.. మూడో రోజు రెండో సెషన్ సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసి 402 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. యస్తిక సెంచరీ (113) అనంతరం ఔటైంది. రిచా ఘోష్ (15), స్నేహ్ రాణా (0) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, భారత్-ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ మైదానంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఇదే. -
యస్తికపై వేటు... కమలినికి చోటు
న్యూఢిల్లీ: మహిళల టి20 ప్రపంచకప్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన యస్తిక భాటియాపై వేటు పడింది. ఆమె స్థానంలో యువ వికెట్ కీపర్ బ్యాటర్ కమలినికి భారత మహిళల క్రికెట్ జట్టులో చోటు దక్కింది. ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడల కోసం బీసీసీఐ మంగళవారం 15 మందితో కూడిన మహిళల జట్టును ప్రకటించింది. 2023లో హాంగ్జౌలో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల జట్టు పసిడి పతకం సాధించింది. దీంతో ఈసారి మన జట్టు డిఫెండింగ్ చాంపియన్‌గా ఈ క్రీడల్లో అడుగు పెట్టనుంది. ఆసియా క్రీడల్లో భాగంగా... పురుషుల, మహిళల క్రికెట్లో టి20 ఫార్మాట్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. తాజా టి20 వరల్డ్‌కప్‌లో జట్టును గ్రూప్ దశ దాటించలేకపోయినప్పటికీ... 37 ఏళ్ల హర్మన్‌ప్రీత్ కౌర్‌నే కెప్టెన్‌గా కొనసాగించారు. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. వరల్డ్‌కప్‌లో ఆడిన జట్టులో యస్తికపై మాత్రమే వేటు వేశారు. గాయం కారణంగా ప్రపంచకప్ మధ్యలో జట్టుకు దూరమైన శ్రేయాంక పాటిల్‌ను కూడా ఎంపిక చేశారు. అయితే ఈ టోర్నీకి ముందు ఆమె ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. భారత జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్, కమలిని, భారతి ఫుల్మాలి, శ్రీచరణి, రేణుక ఠాకూర్, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, రాధ యాదవ్, నందని శర్మ. -
మెరిసిన జెమీమా, యస్తిక
చెమ్స్‌ఫోర్డ్: బ్యాటింగ్‌లో జెమీమా రోడ్రిగ్స్ (40 బంతుల్లో 69; 10 ఫోర్లు, 1 సిక్స్), యస్తిక భాటియా (40 బంతుల్లో 54; 9 ఫోర్లు, 1 సిక్స్)... బౌలింగ్‌లో నందని శర్మ (3/34) రాణించడంతో... ఇంగ్లండ్ మహిళల జట్టుతో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 38 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 188 పరుగులు సాధించింది. రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో... వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ఈ మ్యాచ్‌లో టీమిండియాకు సారథ్యం వహించింది. ఇంగ్లండ్ బౌలర్ లారెన్ బెల్ (3/34) తొలి ఓవర్లోనే భారత ఓపెనర్లు స్మృతి (0), షఫాలీ వర్మ (2)లను అవుట్ చేసింది. 7 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత్‌ను జెమీమా, యస్తిక ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 76 బంతుల్లో 126 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. అయితే మూడు బంతుల తేడాలో జెమీమా, యస్తిక నిష్క్రమించారు. చివర్లో దీప్తి శర్మ (13 బంతుల్లో 22; 4 ఫోర్లు) ధాటిగా ఆడటంతో భారత్‌కు గౌరవప్రద స్కోరు నమోదు చేసింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నిరీ్ణత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 150 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. అమీ జోన్స్ (48 బంతుల్లో 67; 9 ఫోర్లు) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేసిన చండీగఢ్ పేస్ బౌలర్ నందని శర్మ మూడు వికెట్లతో ఆకట్టుకుంది. క్రాంతి గౌడ్ రెండు వికెట్లు తీయగా... శ్రీచరణి, దీప్తి శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. జెమీమాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. సిరీస్‌లోని రెండో టి20 మ్యాచ్ ఈరోజు బ్రిస్టల్‌లో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్ చానెల్లో, సోనీ లివ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. చెమ్స్‌ఫోర్డ్ వేదికగా తొలి టీ20లో 38 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ సన్నాహకాల్లో భాగంగా భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది.ఇందులో భాగంగా తొలుత ఈసీబీ డెవలప్మెంట్ వుమెన్స్ ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన భారత్.. ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ఇక అసలు పోటీలో భాగంగా గురువారం రాత్రి మ్యాచ్‌లో.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఆహ్వానం మేరకు భారత జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది.రాణించిన యస్తికా, జెమీమాఓపెనర్లు స్మృతి మంధాన (0), షఫాలీ వర్మ (2) తీవ్రంగా నిరాశపరచగా.. వన్‌డౌన్ బ్యాటర్ యస్తికా భాటియా అర్ధ శతకం (40 బంతుల్లో 54)తో రాణించింది. ఇక నాలుగో స్థానంలో బరిలోకి దిగిన జెమీమా రోడ్రిగ్స్ మెరుపు ఇన్నింగ్స్ (40 బంతుల్లో 69)తో ఆకట్టుకుంది.మిగిలిన వారిలో ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (13 బంతుల్లో 22) చెప్పుకోదగ్గ స్కోరు చేసింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో భారత మహిళా జట్టు ఏడు వికెట్ల నష్టానికి 188 పరుగులు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు.చెలరేగిన బౌలర్లుఓపెనర్లు అలిస్ క్యాప్సీ (6), సోఫియా డంక్లీ (16)లను క్రాంతి గౌడ్ వెనక్కి పంపగా.. అర్ధ శతకం (67)తో జోరు మీదున్న అమీ జోన్స్ (67)ను నందిని శర్మ అవుట్ చేసింది. మిగిలిన ఇంగ్లండ్ బ్యాటర్లలో హీదర్ నైట్ (21) మాత్రమే ఇరవై పరుగుల మార్కు దాటింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి ఇంగ్లండ్ 150 పరుగుల వద్ద నిలిచిపోయింది.భారత బౌలర్లలో క్రాంతి గౌడ్ రెండు వికెట్లు దక్కించుకోగా.. నందిని శర్మ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. శ్రీచరణి, దీప్తి శర్మ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇక తొలి టీ20లో ఇంగ్లండ్‌పై 38 పరుగుల తేడాతో గెలిచిన మంధాన సేన.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.చదవండి: ‘అతడు ప్లే ఆఫ్స్‌లో విఫలమవుతూనే ఉన్నాడు’ -
గుజరాత్ జెయింట్స్‌కు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ అవుట్
మహిళల ప్రీమియర్ లీగ్-2026 సీజన్ ఆరంభానికి ముందు గుజరాత్ జెయింట్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ యస్తికా భాటియా గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమైంది. డబ్ల్యూపీఎల్-2026 వేలంలో యస్తికాను రూ.50 లక్షలకు గుజరాత్ కొనుగొలు చేసింది. అయితే వేలానికి ముందే యస్తికా మోకాలి గాయంతో బాధపడతోందికానీ డబ్ల్యూపీఎల్ ఆరంభ సమయానికి యస్తిక ఫిట్నెస్ సాధిస్తుందని గుజరాత్ భావించింది. కానీ ఆమె పూర్తిగా కోలుకోవడానికి మరో నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే డబ్ల్యూపీఎల్ నుంచి భాటియా వైదొలిగింది. ఈ విషయాన్ని గుజరాత్ సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది.ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు గుజరాత్ ఓ వీడియో రిలీజ్ చేసింది. కాగా యస్తికా గాయం కారంణంగా వన్డే వరల్డ్‌కప్-2025కు కూడా దూరమైన సంగతి తెలిసిందే. ఆమో స్ధానంలో ఉమా ఛెత్రీని జట్టులోకి తీసుకున్నారు. అయితే గుజరాత్ జెయింట్స్‌కు యస్తికా స్ధానాన్ని మరొక ప్లేయర్‌తో భర్తీ చేసే అవకాశం లేదు. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ఒక ప్లేయర్ వేలానికి ముందే గాయపడి ఉన్నప్పటికి జట్టులోకి తీసుకుంటే.. తర్వాత గాయం కారణంగా దూరమైతే వారి స్ధానంలో వేరే ప్లేయర్‌ను ఎవరినీ తీసుకోవడానికి వీలుండదు. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశముంది.స్టార్ ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ కూడా ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. ఇక డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో నవీ ముంబై వేదికగా ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ ఉమెన్స్ జట్లు తలపడనున్నాయి.గుజరాత్ జెయింట్స్ జట్టుయాష్లే గార్డనర్, డానీ వ్యాట్-హాడ్జ్, భారతి ఫుల్మాలి, అనుష్క శర్మ,సోఫీ డివైన్, జార్జియా వేర్హామ్, కిమ్ గార్త్, కనికా అహుజా, తనూజా కన్వర్,యుషి సోని, బెత్ మూనీ, యస్తికా భాటియా, శివాని సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, కాశ్వి గౌతమ్, రాజేశ్వరి గైక్వాడ్, టైటాస్ సాధు, హ్యాపీ కుమారి


