విజయం దిశగా భారత్‌ | Indian womens cricket team close to huge victory in historic Test match | Sakshi
Sakshi News home page

విజయం దిశగా భారత్‌

Jul 13 2026 2:40 AM | Updated on Jul 13 2026 2:40 AM

Indian womens cricket team close to huge victory in historic Test match

ఇంగ్లండ్‌ లక్ష్యం 457; ప్రస్తుతం 130/6

యస్తిక భాటియా సూపర్‌ సెంచరీ

నేడు మధ్యాహ్నం గం. 3:30 నుంచి సోనీ స్పోర్ట్స్‌ చానెల్స్, సోనీ లివ్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం  

లండన్‌: చారిత్రక టెస్టు మ్యాచ్‌లో భారత మహిళల క్రికెట్‌ జట్టు భారీ విజయానికి చేరువైంది. ‘క్రికెట్‌ మక్కా’ లార్డ్స్‌లో జరుగుతున్న తొలి మహిళల సుదీర్ఘ ఫార్మాట్‌ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని భారత జట్టు ఆతిథ్య ఇంగ్లండ్‌పై సంపూర్ణ ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఓవర్‌నైట్‌ స్కోరు 154/1తో ఆదివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌ 86.3 ఓవర్లలో 341/7 వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. 

వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ యస్తిక భాటియా (113; 14 ఫోర్లు) లార్డ్స్‌ మైదానంలో సెంచరీ చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పగా... స్మృతి మంధాన (70; 9 ఫోర్లు, 1 సిక్స్‌), రిచా ఘోష్‌ (50 నాటౌట్‌; 8 ఫోర్లు) అర్ధశతకాలు సాధించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఎకిల్‌స్టోన్‌ 5 వికెట్లు పడగొట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం 115 పరుగులు కలుపుకొని ప్రత్యర్థి ముందు భారత జట్టు 457 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 

కొండంత లక్ష్యఛేదనలో ఇంగ్లండ్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. భారత బౌలర్లలో క్రాంతి, సయాలి, స్నేహ్‌ రాణా తలా రెండు వికెట్లు తీశారు. చేతిలో 4 వికెట్లు ఉన్న ఇంగ్లండ్‌ విజయానికి ఇంకా 327 పరుగులు చేయాల్సి ఉంది. నేడు మ్యాచ్‌కు చివరి రోజు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement