టీజీ20 లీగ్‌ విజేతగా హైదరాబాద్‌ | Hyderabad E Champions won Inaugural TG20 League | Sakshi
Sakshi News home page

టీజీ20 లీగ్‌ విజేతగా హైదరాబాద్‌

Jul 12 2026 11:39 PM | Updated on Jul 12 2026 11:39 PM

Hyderabad E Champions won Inaugural TG20 League

టీజీ20 లీగ్‌ ఆరంభ ఎడిషన్‌ (2026) విజేతగా హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ జట్టు అవతరించింది. ఇవాళ (జులై 12) జరిగిన ఫైనల్లో ఆ జట్టు అన్విత ఖమ్మం ఏసెస్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన హైదరాబాద్‌ జట్టు ఖమ్మంను 157 పరుగులకే (8 వికెట్ల నష్టానికి) పరిమితం చేసింది. అనంతరం లక్ష్యాన​ఇన 17.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. 

రాణించిన జైస్వాల్‌
మికిల్‌ జైస్వాల్‌ (39 బంతుల్లో 65; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటాడు. ఆఖర్లో విద్యానంద రెడ్డి (20 నాటౌట్‌) బ్యాట్‌ ఝులిపించాడు. మిగతా ఆటగాళ్లలో పరాస్‌ రాజ్‌ 3, పి రెడ్డి 15, జి కృష్ణా రెడ్డి 3, హిమతేజ 31, సహేంద్ర మల్లు 11, వి రెడ్డి అమిస్థపురం​ 1 (నాటౌట్‌) పరుగు చేశారు.

స్టార్‌ బ్యాటర్‌ మిలింద్‌ సహా హర్షిత్‌ రాజ్‌ డకౌట్లయ్యారు. హైదరాబాద్‌ బౌలర్లలో యశ్‌వీర్‌ గౌడ్‌ 3 వికెట్లతో సత్తా చాటగా.. మెహతా, దేవ్‌గౌడ్‌ తలో 2, రాధోడ్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

విజయతీరాలకు చేర్చిన వైష్ణవ్‌
158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్‌ ఆదిలోనే వికాస్‌ రెడ్డి (4) వికెట్‌ కోల్పోయినప్పటికీ.. అభిరథ్‌ రెడ్డి (48), అశ్విన్‌ (36) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరు కూడా ఔటయ్యాక వైష్ణవ్‌ రెడ్డి (41 నాటౌట్‌) గెలుపు బాధ్యతలను భుజాలకేసుకొని హైదరాబాద్‌ జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడికి ప్రణవ్‌ (19 నాటౌట్‌) సహకరించాడు. ఫలితంగా హైదరాబాద్‌ జట్టు మరో 14 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరి, ఛాంపియన్‌గా అవతరించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement