సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రతిష్టాత్మకంగా తొలిసారి నిర్వహించిన తెలంగాణ టి20 లీగ్ నేటితో ముగియనుంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగే ఫైనల్లో ఈ–చాంపియన్స్‌తో ఖమ్మం ఏసెస్ జట్టు తలపడుతుంది.
లీగ్ దశలో అన్ని మ్యాచ్‌లూ గెలిచి అజేయంగా నిలిచిన చాంపియన్స్ టీమ్... క్వాలిఫయర్–1లో ఖమ్మం ఏసెస్ చేతిలోనే ఓడింది. ఇప్పుడు ఈ రెండు జట్లు మరో సారి తలపడే సమరంతో టోర్నీ విజేత ఎవరో తేలనుంది. సా.7.15 నుంచి జరిగే ఫైనల్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్–1, జియో హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.


