వింబుల్డన్‌ ఫైనల్లో నెస్కోవా, ముకోవా | Noskova and Muchova in Wimbledon final | Sakshi
Sakshi News home page

వింబుల్డన్‌ ఫైనల్లో నెస్కోవా, ముకోవా

Jul 10 2026 1:45 AM | Updated on Jul 10 2026 1:45 AM

Noskova and Muchova in Wimbledon final

లండన్‌: వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ విభాగంలో పదో సీడ్‌ కరోలినా ముకోవా (చెక్‌ రిపబ్లిక్‌), తొమ్మిదో సీడ్‌ లిండా నెస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన సెమీఫైనల్స్‌లో ముకోవా 6–2, 1–6, 7–6 (12/10)తో ఏడో సీడ్‌ కోకో గాఫ్‌ (అమెరికా)పై, నెస్కోవా 6–4, 6–4తో 12వ సీడ్‌ మార్టా కొస్టుక్‌ (ఉక్రెయిన్‌)పై గెలిచారు. శనివారం ఫైనల్‌ జరుగుతుంది. ఎవరు గెలిచినా వారికి తొలి గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ అవుతుంది. ముకోవా 2023 ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. నెస్కోవా మాత్రం తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఫైనల్‌ చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement