సెమీస్‌లో సినెర్‌ | Jannik Sinner advances to Wimbledon mens singles semifinals | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సినెర్‌

Jul 8 2026 2:15 AM | Updated on Jul 8 2026 2:15 AM

Jannik Sinner advances to Wimbledon mens singles semifinals

లండన్‌: వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ యానిక్‌ సినెర్‌ (ఇటలీ) సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. మంగళవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ సినెర్‌ 7–5, 7–6 (7/4), 6–3తో జాన్‌ లెనార్డ్‌ స్ట్రఫ్‌ (జర్మనీ)పై విజయం సాధించాడు. 2 గంటల 35 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సినెర్‌ 16 ఏస్‌లు సంధించాడు. 

32 విన్నర్స్‌ కొట్టిన సినెర్, 26 అనవసర తప్పిదాలు చేశాడు. రెండో సీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ), ఆర్థర్‌ ఫెరీ (బ్రిటన్‌), టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా) క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టారు. మహిళల సింగిల్స్‌ విభాగంలో ఏడో సీడ్‌ కోకో గాఫ్‌ (అమెరికా), పదో సీడ్‌ కరోలినా ముకోవా (చెక్‌ రిపబ్లిక్‌) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్‌ ఫైనల్స్‌లో కోకో గాఫ్‌ 4–6, 6–3, 6–3తో నాలుగో సీడ్‌ జెస్సికా పెగూలా (అమెరికా)పై, ముకోవా 7–6 (7/4), 6–4తో నయోమి ఒసాకా (జపాన్‌)పై విజయం సాధించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement