ఇంగ్లండ్‌ X ఆ్రస్టేలియా | Womens T20 World Cup final today | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ X ఆ్రస్టేలియా

Jul 5 2026 4:15 AM | Updated on Jul 5 2026 4:15 AM

Womens T20 World Cup final today

నేడు మహిళల టి20 ప్రపంచకప్‌ ఫైనల్‌

లండన్‌: మహిళల టి20 ప్రపంచకప్‌ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. టోర్నీ ఆరంభం నుంచి అజేయంగా దూసుకెళ్తున్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ మధ్య... లార్డ్స్‌ వేదికగా నేడు తుదిపోరు జరగనుంది. ఇప్పటి వరకు జరిగిన తొమ్మిది టి20 ప్రపంచకప్‌లలో ఆ్రస్టేలియా ఆరుసార్లు (2010, 2012, 2014, 2018, 2020, 2023) చాంపియన్‌గా నిలవగా... 2009 ఆరంభ సీజన్‌లో ట్రోఫీ చేజిక్కించుకున్న ఇంగ్లండ్‌ రెండో కప్పు కోసం 17 ఏళ్లుగా నిరీక్షిస్తోంది. 

ఈ మధ్యలో మూడుసార్లు (2012, 2014, 2018) ఫైనల్‌కు చేరిన ఇంగ్లండ్‌... ఆసీస్‌ చేతిలోనే పరాజయం పాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ సారి సొంతగడ్డపై టోర్నీ జరుగుతుండటంతో అభిమానుల మద్దతుతో ముందంజ వేయాలని ఇంగ్లండ్‌ భావిస్తోంది. గ్రూప్‌–1లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన ఆ్రస్టేలియా... సెమీఫైనల్లో వెస్టిండీస్‌ను చిత్తుచేయగా... గ్రూప్‌–2లో ఐదు విజయాలు సాధించిన ఇంగ్లండ్‌... సెమీస్‌లో దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. 

మూనీ, వాల్, లిచ్‌ఫీల్డ్, గార్డ్‌నర్, సదర్లాండ్‌తో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ లైనప్‌ అత్యంత పటిష్టంగా ఉంది. బౌలింగ్‌లో కెప్టెన్‌ మొలినెక్స్, గార్త్, అలానా కింగ్‌ కీలకం కానున్నారు. మరోవైపు కెప్టెన్‌ సీవర్‌ బ్రంట్, వ్యాట్, జోన్స్,  నైట్, కాప్సీతో ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ కూడా శత్రుదుర్బేధ్యంగా ఉంది. ఎకిల్‌స్టోన్, కెంప్, లిన్సే  బౌలింగ్‌ను కంగారూలు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. పిచ్‌ అటు బౌలింగ్‌ ఇటు బ్యాటింగ్‌కు సమానంగా సహకరించనుంది. మ్యాచ్‌కు వర్ష సూచనలేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement