నాట్‌ స్కివర్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌.. ఆస్ట్రేలియా టార్గెట్‌ ఎంతంటే? | Nat Sciver-Brunt, Freya Kemp take England to 150-4 vs Australia at Lords | Sakshi
Sakshi News home page

T20 WC 2026: నాట్‌ స్కివర్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌.. ఆస్ట్రేలియా టార్గెట్‌ ఎంతంటే?

Jul 5 2026 9:41 PM | Updated on Jul 5 2026 9:41 PM

Nat Sciver-Brunt, Freya Kemp take England to 150-4 vs Australia at Lords

మ‌హిళ‌ల ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో భాగంగా లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఫైనల్ పోరులో ఇంగ్లండ్ ఓ మోస్తారు స్కోర్‌కే పరిమితమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల న‌ష్టానికి 150  పరుగుల స్కోర్ సాధించింది.

ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓపెనర్లు అమీ జోన్స్‌(6), డ్యానీ వ్యాట్‌(8) విఫలమైనప్పటికి నాట్‌ స్కివర్‌(58 నాటౌట్‌) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడింది. ఆమెతో పాటు ఆఖరి  ఫ్రేయా కెంప్(44 నాటౌట్‌) దూకుడుగా ఆడింది. ఆస్ట్రేలియా బౌలర్లలో కిమ్‌ గార్త్‌, హామిల్టన్‌,కెప్టెన్‌ సోఫీ, సదర్లాండ్‌ తలా వికెట్‌ సాధించారు.

తుది జట్లు
ఇంగ్లండ్ మహిళలు: అమీ జోన్స్ (వికెట్ కీపర్‌), డాని వ్యాట్-హాడ్జ్, నాట్ స్కివర్-బ్రంట్ (కెప్టెన్‌), ఆలిస్ క్యాప్సే, హీథర్ నైట్, ఫ్రెయా కెంప్, డేనియల్ గిబ్సన్, షార్లెట్ డీన్, లిన్సే స్మిత్, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ బెల్

ఆస్ట్రేలియా మహిళలు: జార్జియా వోల్, బెత్ మూనీ(వికెట్ కీపర్‌), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, ఆష్లీ గార్డనర్, జార్జియా వేర్‌హామ్, అన్నాబెల్ సదర్లాండ్, నికోలా కారీ, సోఫీ మోలినెక్స్(కెప్టెన్‌), కిమ్ గార్త్, లూసీ హామిల్టన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement