
ఆసియాకప్-2025 ఛాంపియన్స్‌గా నిలిచిన తర్వాత భారత క్రికెట్ జట్టు వరుస సిరీస్‌లతో బిజీబిజీగా గడపనుంది. టీమిండియా 3 నెలలపాటు మూడు ఫార్మాట్లలోనూ తలపడనుంది. వెస్టిండీస్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి అగ్రశ్రేణి జట్లను భారత్ ఢీకొట్టనుంది. ఈ క్రమంలో 2025 ఏడాదిలో టీమిండియా మిగిలిన షెడ్యూల్‌పై ఓ లుక్కేద్దాం.
వెస్టిండీస్‌తో రెడ్ బాల్ సమరం..
ఆసియాకప్ ముగిసిన మూడు రోజులకే వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. అక్టోబర్ 2 నుంచి ఈ రెడ్ బాల్ సిరీస్ ప్రారంభం కానుంది.
🔹వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ షెడ్యూల్
1వ టెస్ట్: అక్టోబర్ 2–6, నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్
2వ టెస్ట్: అక్టోబర్ 10–14, ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా
విండీస్ సిరీస్ ముగిసిన 5 రోజులకే భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమిండియా మూడు వన్డేలు, 5 టీ20ల్లో తలపడనుంది. ఈ వైట్‌బాల్ సిరీస్‌లు అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానున్నాయి.
టీమిండియా ఆస్ట్రేలియా టూర్ షెడ్యూల్ ఇదే..
వన్డే సిరీస్:
అక్టోబర్ 19: పెర్త్(తొలి వన్డే)
అక్టోబర్ 23: అడిలైడ్(రెండో వన్డే)
అక్టోబర్ 25: సిడ్నీ(మూడో వన్డే)
టీ20 సిరీస్:
అక్టోబర్ 29: మనుకా ఓవల్(తొలి టీ20)
నవంబర్ 2: మెల్‌బోర్న్(రెండో టీ20)
నవంబర్ 6: హోబర్ట్(మూడో టీ20)
నవంబర్ 8: గోల్డ్ కోస్ట్(నాలుగో టీ20)
నవంబర్ 10: బ్రిస్బేన్(ఐదో టీ20)
ఆ తర్వాత భారత పురుషుల జట్టు స్వదేశంలో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లో తలపడనుంది.
భారత్-దక్షిణాఫ్రికా మల్టీ ఫార్మాట్ సిరీస్ షెడ్యూల్ ఇదే..
టెస్ట్ సిరీస్:
నవంబర్ 14–18: అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ(తొలి టెస్టు)
నవంబర్ 22–26: బర్సపారా స్టేడియం, గౌహతి(రెండో టెస్టు)
వన్డే సిరీస్:
నవంబర్ 30: రాంచీ(తొలి వన్డే)
డిసెంబర్ 3: రాయ్‌పూర్(రెండో వన్డే)
డిసెంబర్ 6: విశాఖపట్నం(మూడో టీ20)
టీ20 సిరీస్:
డిసెంబర్ 9: కటక్(తొలి టీ20)
డిసెంబర్ 11: న్యూ చండీగఢ్(రెండో టీ20)
డిసెంబర్ 14: ధర్మశాల(మూడో టీ20)
డిసెంబర్ 17: లక్నో(నాలుగో టీ20)
డిసెంబర్ 19: అహ్మదాబాద్(ఐదో టీ20)
👉ఆసీస్, సౌతాఫ్రికాలతో టీ20 సిరీస్‌లు పొట్టి ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా జరగనున్నాయి.