బెనోని వేదికగా దక్షిణాఫ్రికా అండర్-19తో జరుగుతున్న మొదటి యూత్ వన్డేలో భారత్ అండర్-19 జట్టు బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత యువ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 300 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ(11), వైస్ కెప్టెన్ ఆరోన్ జార్జ్(11), త్రివేది(21) వంటి టాపార్డర్ బ్యాటర్లు విఫలమైనప్పటికి.. మిడిలార్డర్, లోయార్డర్ బ్యాటర్లు మాత్రం అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.
ముఖ్యంగా 19 ఏళ్ల హర్వంశ్ సింగ్ పంగాలియా అసాధరణ పోరాటం కనబరిచాడు. క్లిష్ట సమయంలో హర్వంశ్.. అంబరీష్‌తో కలిసిఐదో వికెట్‌కు 140 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. పంగాలియా 95 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 93 పరుగులు చేశాడు. అతడితో పాటు అంబరిష్(65), కన్షిక్ చౌహన్(32), ఖిలాన్ పటేల్(26) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.
సౌతాఫ్రికా బౌలర్లలో బాసన్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. సోనీ,బాసన్, మబాతా తలా వికెట్ సాధించారు. కాగా ఈ సిరీస్ అండర్-19 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా జరుగుతోంది. ఈ సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ అయూష్ మాత్రే దూరమయ్యాడు. ఈ క్రమంలోనే వైభవ్‌కు జట్టు పగ్గాలను అప్పగించారు. కానీ కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌లో సూర్యవంశీ విఫలమయ్యాడు.
తుది జట్లు
భారత్ అండర్19: వైభవ్ సూర్యవంశీ (కెప్టెన్), ఆరోన్ వర్గీస్, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు (కీపర్), హర్వంశ్ పంగాలియా, ఆర్.ఎస్. అంబరీష్, కనిష్క్ చౌహాన్, మహమ్మద్ ఎనాన్, ఖిలన్ పటేల్, దీపేష్ దేవేంద్రన్, హెనిల్ పటేల్.
దక్షిణాఫ్రికా అండర్ -19:మొహమ్మద్ బుల్బులియా (కెప్టెన్), జోరిచ్ వాన్ షాల్క్‌వైక్, అద్నాన్ లగాడియన్, జేసన్ రౌల్స్, అర్మాన్ మనక్, పాల్ జేమ్స్, బండిల్ మబాతా, లెతాబో పహ్లామోహ్లాకా (కీపర్), జెజె బాసన్, బయండా మజోలా, నితాండో సోని.
చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ వచ్చేశాడు


