breaking news
India U19 vs South Africa U19
-
వైభవ్ సూర్యవంశీ ఖాతాలో మరో ‘ఫాస్టెస్ట్’ రికార్డు
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి అదరగొట్టాడు. సౌతాఫ్రికాతో రెండో యూత్ వన్డేలో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మెరిశాడు. బెనోనీ వేదికగా ఆతిథ్య జట్టు బౌలర్లను ఓ ఆట ఆడుకున్న పద్నాలుగేళ్ల ఈ చిచ్చరపిడుగు.. మెరుపు అర్ధ శతకంతో సత్తా చాటాడు.మరో ‘ఫాస్టెస్ట్’ రికార్డుకేవలం పందొమ్మిది బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్న వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. యూత్ వన్డేల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన మూడో ఆటగాడిగా.. అఫ్గనిస్తాన్ స్టార్ ఒమర్జాయ్ సరసన నిలిచాడు. సౌతాఫ్రికాకు చెందిన స్టీవ్ స్టాల్క్ (13 బంతుల్లో 2016లో), టీమిండియా ప్రస్తుత స్టార్ రిషభ్ పంత్ (Rishabh Pant- 18 బంతుల్లో 2018లో) ఈ ఇద్దరి కంటే ముందు వరుసలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. యూత్ వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును వైభవ్ తన పేరిట లిఖించుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ గడ్డ మీద గతేడాది 52 బంతుల్లోనే ఈ లెఫ్టాండర్ బ్యాటర్ శతక్కొట్టాడు. పది సిక్సర్లు ఇక సౌతాఫ్రికాతో రెండో మ్యాచ్‌లో మొత్తంగా 24 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. 68 పరుగులు సాధించాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఇన్నింగ్స్‌లో ఒక ఫోర్‌తో పాటు పది సిక్సర్లు ఉండటం విశేషం. కాగా అండర్–19 ప్రపంచకప్‌నకు ముందు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో యువ భారత జట్టు దుమ్మురేపడం సానుకూలాంశంగా పరిణమించింది.8 వికెట్ల తేడాతోవరుస మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన వైభవ్ సూర్య వంశీ సారథ్యంలోని భారత అండర్–19 జట్టు మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో వన్డే సిరీస్ పట్టేసింది. బెనోనీలో సోమవారం జరిగిన రెండో మ్యాచ్‌లో యువ భారత్ 8 వికెట్ల తేడాతో (డక్‌వర్త్ – లూయిస్ పద్ధతి ప్రకారం) సౌతాఫ్రికాను చిత్తుచేసింది. మొదట ఆతిథ్య జట్టు 49.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. జాసన్ రౌల్స్ (113 బంతుల్లో 114; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా... డానియల్ బోస్మన్ (31), అద్నాన్ (25) ఫర్వాలేదనిపించారు.యువ భారత బౌలర్లలో కిషన్ సింగ్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం వెలుతురు లేమి కారణంగా ఆటకు అంతరాయం వాటిల్లింది. దీంతో యువ భారత్ లక్ష్యాన్ని 27 ఓవర్లలో 174గా నిర్ణయించారు. ఛేదనలో ఆద్యంతం దూకుడు కనబర్చిన భారత్ 23.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. గీత దాటించడమే లక్ష్యంవైభవ్ సూర్యవంశీ (24 బంతుల్లో 68; 1 ఫోర్, 10 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బంతి ఎక్కడపడ్డా దాన్ని గీత దాటించడమే లక్ష్యంగా సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇప్పటికే సీనియర్ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వైభవ్ సూర్యవంశీ దూకుడుతో లక్ష్యం వేగంగా కరిగిపోయింది. మిగతా వారిలో అభిజ్ఞాన్ కుందు (42 బంతుల్లో 48 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), వేదాంత్ త్రిపాఠి (31 నాటౌట్; 4 ఫోర్లు), హైదరాబాద్ ప్లేయర్ ఆరోన్ జార్జ్ (20; 3 ఫోర్ల) ఫర్వాలేదనిపించారు. సౌతాఫ్రికా బౌలర్లలో మిచెల్ క్రుస్కాంప్ 2 వికెట్లు పడగొట్టాడు. వైభవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కంది. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే బుధవారం ఇక్కడే జరగనుంది. చదవండి: నలిగిపోతున్న క్రికెట్Vaibhav Suryavanshi as captain vs SA U-19:10 Sixes & 1 four in the Innings.14 years old and already terrifying bowlers. Scary talent. 🥶🇮🇳 pic.twitter.com/xUUEnaKGT2— Adarsh (@AdarshUniverse) January 5, 2026 -
వైభవ్ మెరుపులు.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్
అండర్ 19 ప్రపంచకప్-2026 సన్నాహకాల్లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న యూత్ వన్డే సిరీస్‌లో యువ భారత జట్టు అదరగొడుతోంది. తొలి వన్డేలో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత అండర్-19 జట్టు.. ఇప్పడు రెండో వన్డేలోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది.సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో భారత్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది.సౌతాఫ్రికా బ్యాటర్లలో జేసన్ రౌల్స్ సెంచరీతో కదం తొక్కాడు. రౌల్స్ 113 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 114 పరుగులు చేశాడు. భారత యువ పేసర్ కిషన్ కుమార్ సింగ్ 4 వికెట్లతో ప్రోటీస్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు ఆర్ ఆర్ఎస్ అంబరీష్ రెండు, కన్షిక్, దీపేష్ తలా వికెట్ సాధించారు.వైభవ్ మెరుపులు..అనంతరం వర్షం కారణంగా భారత్ లక్ష్యాన్ని 27 ఓవర్లలో 174 పరుగులుగా కుదించారు. లక్ష్య చేధనలో కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. క్రీజులో ఉన్నంత సేపు బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 24 బంతులు మాత్రమే ఎదుర్కొన్న వైభవ్.. 10 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 68 పరుగులు చేశాడు. ఆ తర్వాత అభిజ్ఞాన్ కుందు (48 ), వేదాంత్ త్రివేది (31) అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. భారత జట్టు 23.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఊదిపడేసింది.చదవండి: IND vs SA: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే -
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే
బెనోని వేదికగా సౌతాఫ్రికా అండర్-19తో జరుగుతున్న రెండో యూత్ వన్డేలో భారత్ అండర్ 19 కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. 246 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే సఫారీ బౌలర్లను ఉతికారేశాడు. ఈ యువ సంచలనం విల్లోమూర్ పార్క్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు.ఈ క్రమంలో కేవలం 19 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తంగా కేవలం 24 బంతులు మాత్రమే ఎదుర్కొన్న వైభవ్.. 10 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 68 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి విధ్వంసం ధాటికి భారత్ స్కోర్ 10 ఓవర్లలోనే వంద పరుగుల మార్క్ దాటింది. టీమిండియా విజయానికి ఇంకా 115 పరుగులు కావాలి. అయితే వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది.ప్రస్తుతం క్రీజులో అభిజ్ఞాన్ కుండు(2), వేదాంత్ త్రివేది(9) ఉన్నారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. భారత యువ పేసర్ కిషన్ కుమార్ సింగ్ 4 వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు ఆర్ ఆర్ఎస్ అంబరీష్ రెండు, కన్షిక్, దీపేష్ తలా వికెట్ సాధించారు.ప్రోటీస్ బ్యాటర్లలో జేసన్ రౌల్స్ సెంచరీ సాధించాడు. రౌల్స్ 113 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 114 పరుగులు చేశాడు. కాగా ఈ సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ అయూష్ మాత్రే దూరం కావడంతో జట్టును వైభవ్ నడిపిస్తున్నాడు.చదవండి: 129 ఫోర్లు, 59 సిక్సర్లు.. 1009 రన్స్ బాదిన ఆ ‘కుర్రాడు’ ఎక్కడ?Vaibhav vikraal Suryavanshi pic.twitter.com/eqiMzYeYvI— Anuj (@A1iconic) January 5, 2026 -
చెలరేగిన భారత బౌలర్లు.. సౌతాఫ్రికా స్కోరెంతంటే?
బెనోని వేదికగా దక్షిణాఫ్రికా అండర్-19తో జరుగుతున్న రెండో యూత్ వన్డేలో భారత బౌలర్లు అదరగొట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 49.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. భారత యువ పేసర్ కిషన్ కుమార్ సింగ్ 4 వికెట్లు పడగొట్టి సఫారీల పతనాన్ని శాసించాడు.అతడితో పాటు ఆర్ ఆర్ఎస్ అంబరీష్ రెండు, కన్షిక్, దీపేష్ తలా వికెట్ సాధించారు. ప్రోటీస్ బ్యాటర్లలో జేసన్ రౌల్స్ (Jason Rowles) ఒక్కడో విరోచిత పోరాటం కనబరిచాడు. సహచరులు ఘోరంగా విఫలమైనా రౌల్స్ మాత్రం అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 113 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 114 పరుగులు చేశాడు.దూకుడుగా ఆడుతున్న వైభవ్..అనంతరం లక్ష్య చేధనలో భారత్ దూకుడుగా ఆడుతోంది. ముఖ్యంగా కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ ప్రత్యర్ధి బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడుతున్నాడు. కేవలం 19 బంతుల్లోనే 8 సిక్స్‌ల సాయంతో తన హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. వైస్ కెప్టెన్ ఆరోన్ జార్జ్ 20 పరుగులు చేసి ఔటయ్యాడు.క్రీజులో సూర్యవంశీ, వేదాంత్ త్రివేది ఉన్నారు. కాగా ఇప్పటికే తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి కూడా సిరీస్‌ను సొంతం చేసుకోవాలని యంగ్ టీమిండియా పట్టుదలతో ఉంది.చదవండి: 129 ఫోర్లు, 59 సిక్సర్లు.. 1009 రన్స్ బాదిన ఆ ‘కుర్రాడు’ ఎక్కడ? -
వైభవ్ విఫలమైనా.. టీమిండియా భారీ స్కోర్
బెనోని వేదికగా దక్షిణాఫ్రికా అండర్-19తో జరుగుతున్న మొదటి యూత్ వన్డేలో భారత్ అండర్-19 జట్టు బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత యువ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 300 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ(11), వైస్ కెప్టెన్ ఆరోన్ జార్జ్(11), త్రివేది(21) వంటి టాపార్డర్ బ్యాటర్లు విఫలమైనప్పటికి.. మిడిలార్డర్, లోయార్డర్ బ్యాటర్లు మాత్రం అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.ముఖ్యంగా 19 ఏళ్ల హర్వంశ్ సింగ్ పంగాలియా అసాధరణ పోరాటం కనబరిచాడు. క్లిష్ట సమయంలో హర్వంశ్.. అంబరీష్‌తో కలిసిఐదో వికెట్‌కు 140 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. పంగాలియా 95 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 93 పరుగులు చేశాడు. అతడితో పాటు అంబరిష్(65), కన్షిక్ చౌహన్(32), ఖిలాన్ పటేల్(26) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. సౌతాఫ్రికా బౌలర్లలో బాసన్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. సోనీ,బాసన్, మబాతా తలా వికెట్ సాధించారు. కాగా ఈ సిరీస్ అండర్-19 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా జరుగుతోంది. ఈ సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ అయూష్ మాత్రే దూరమయ్యాడు. ఈ క్రమంలోనే వైభవ్‌కు జట్టు పగ్గాలను అప్పగించారు. కానీ కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌లో సూర్యవంశీ విఫలమయ్యాడు.తుది జట్లుభారత్ అండర్19: వైభవ్ సూర్యవంశీ (కెప్టెన్), ఆరోన్ వర్గీస్, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు (కీపర్), హర్వంశ్ పంగాలియా, ఆర్.ఎస్. అంబరీష్, కనిష్క్ చౌహాన్, మహమ్మద్ ఎనాన్, ఖిలన్ పటేల్, దీపేష్ దేవేంద్రన్, హెనిల్ పటేల్.దక్షిణాఫ్రికా అండర్ -19:మొహమ్మద్ బుల్బులియా (కెప్టెన్), జోరిచ్ వాన్ షాల్క్వైక్, అద్నాన్ లగాడియన్, జేసన్ రౌల్స్, అర్మాన్ మనక్, పాల్ జేమ్స్, బండిల్ మబాతా, లెతాబో పహ్లామోహ్లాకా (కీపర్), జెజె బాసన్, బయండా మజోలా, నితాండో సోని.చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ వచ్చేశాడు -
IND vs SA: కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ ఫెయిల్
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ పేలవ బ్యాటింగ్‌తో నిరాశపరిచాడు. భారీ అంచనాల నడుమ సౌతాఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన ఈ పద్నాలుగేళ్ల చిచ్చర పిడుగు.. తొలి మ్యాచ్‌లోనే విఫలమయ్యాడు. గతేడాది ఐపీఎల్లో సంచలన సెంచరీతో మెరిసిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)... ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో భారత అండర్-19 జట్టు తరఫునా అదరగొట్టాడు.సెంచరీల మోతఓపెనింగ్ బ్యాటర్‌గా బరిలోకి దిగి యూత్ వన్డే, యూత్ టెస్టుల్లో సెంచరీల మోత మోగించాడు. ఇటీవల ఆసియా అండర్-19 వన్డే కప్‌లోనూ రాణించిన వైభవ్ సూర్యవంశీ.. తన అద్భుత ప్రదర్శనలకు గానూ ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అందుకున్నాడు. ఇక అంతకు ముందే విజయ్ హజారే ట్రోఫీ 2025-26 టోర్నీలో బిహార్ తరఫున వైస్ కెప్టెన్ హోదాలో భారీ శతకం బాదాడు.తాత్కాలిక కెప్టెన్గాఅనంతరం సౌతాఫ్రికా అండర్-19 జట్టుతో (IND U19 Vs SA U19) యూత్ వన్డేలతో వైభవ్ సూర్యవంశీ బిజీ అయ్యాడు. కొత్త ఏడాదిలోని ఈ తొలి టూర్లో భాగంగా భారత అండర్-19 జట్టు సౌతాఫ్రికా యువ జట్టుతో మూడు యూత్ వన్డేలు ఆడనుంది. తొలి మ్యాచ్‌లకు రెగ్యులర్ కెప్టెన్ ఆయుశ్ మాత్రే దూరం కాగా.. వైభవ్ సూర్యవంశీ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.బెనోని వేదికగా శనివారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత యువ జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఇటీవలి కాలంలో మెరుగైన ఇన్నింగ్స్ ఆడుతూ ఫామ్‌లో ఉన్న ఆరోన్ జార్జ్ (5) ఓపెనర్‌గా వచ్చి విఫలమయ్యాడు. ఇలాంటి తరుణంలో.. తన దూకుడైన శైలికి భిన్నంగా బాధ్యతాయుతంగా ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ.11 పరుగులు చేసిఅయితే, 12 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 11 పరుగులు చేసిన వైభవ్.. జేజే బాసన్ బౌలింగ్‌లో లెథాబోకు క్యాచ్ ఇవ్వడంతో పెవిలియన్ చేరాల్సి వచ్చింది. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ఇలా వైభవ్ విఫలం కావడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి వన్‌డౌన్‌లో వచ్చిన వేదాంత్ త్రివేది (21), వికెట్ కీపర్ బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు (21) కూడా చేతులెత్తేశారు. ఈ క్రమంలో 15 ఓవర్ల ఆట ముగిసేసరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి కేవలం 68 పరుగులే చేసి కష్టాల్లో కూరుకుపోయింది.చదవండి: టీ20 ప్రపంచకప్-2026: అభిషేక్ శర్మపై కూడా వేటు వేస్తారా?


