బెనోని వేదికగా దక్షిణాఫ్రికా అండర్-19తో జరుగుతున్న రెండో యూత్ వన్డేలో భారత బౌలర్లు అదరగొట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 49.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. భారత యువ పేసర్ కిషన్ కుమార్ సింగ్ 4 వికెట్లు పడగొట్టి సఫారీల పతనాన్ని శాసించాడు.
అతడితో పాటు ఆర్ ఆర్ఎస్ అంబరీష్ రెండు, కన్షిక్, దీపేష్ తలా వికెట్ సాధించారు. ప్రోటీస్ బ్యాటర్లలో జేసన్ రౌల్స్ (Jason Rowles) ఒక్కడో విరోచిత పోరాటం కనబరిచాడు. సహచరులు ఘోరంగా విఫలమైనా రౌల్స్ మాత్రం అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 113 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 114 పరుగులు చేశాడు.
దూకుడుగా ఆడుతున్న వైభవ్..
అనంతరం లక్ష్య చేధనలో భారత్ దూకుడుగా ఆడుతోంది. ముఖ్యంగా కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ ప్రత్యర్ధి బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడుతున్నాడు. కేవలం 19 బంతుల్లోనే 8 సిక్స్‌ల సాయంతో తన హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. వైస్ కెప్టెన్ ఆరోన్ జార్జ్ 20 పరుగులు చేసి ఔటయ్యాడు.
క్రీజులో సూర్యవంశీ, వేదాంత్ త్రివేది ఉన్నారు. కాగా ఇప్పటికే తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి కూడా సిరీస్‌ను సొంతం చేసుకోవాలని యంగ్ టీమిండియా పట్టుదలతో ఉంది.
చదవండి: 129 ఫోర్లు, 59 సిక్సర్లు.. 1009 రన్స్ బాదిన ఆ ‘కుర్రాడు’ ఎక్కడ?


