
మహిళల టీ20 ప్రపంచకప్-2025కు తెరలేచింది. తొలి మ్యాచ్‌లో గౌహతి వేదికగా భారత్-శ్రీలంక జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ చామరి అథపట్టు తొలుత హర్మన్ సేనను బ్యాటింగ్‌కు ఆహ్హనించింది.
తొలి పోరుకు భారత స్టార్ పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ దూరమైంది. 29 ఏళ్ల రేణుకా ఫిట్‌నెస్ సమస్యలతో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. కానీ టాస్ సందర్భంగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆటగాళ్లంతా ఫిట్‌గా ఉన్నారని, కాంబినేషన్ పరంగా తుది జట్టును ఎంపిక చేశామని పేర్కొనడం గమనార్హం.
అయితే కాలిమడమ గాయం నుంచి కోలుకున్న రేణుకా ఇటీవలే ఆస్ట్రేలియా సిరీస్‌తో తిరిగి కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఆ సిరీస్‌లో మొత్తం మ్యాచ్‌లు ఆడిన రేణుకా.. ఈ మెగా టోర్నీకి ముందు వార్మప్ మ్యాచ్‌లలో కూడా భాగమైంది. అయితే తొలి పోరుకు దూరమైనప్పటికి తదుపరి మ్యాచ్‌లలో రేణుకా ఆడే అవకాశముంది.
మరోవైపు ప్లేయింగ్ ఎలెవన్‌లో తెలుగు అమ్మాయి శ్రీ చరణికి చోటు దక్కింది. కడపకు చెందిన చరణి ఇటీవల కాలంలో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఈ క్రమంలోనే వరల్డ్‌కప్ జట్టులో ఈ యువ ఆఫ్ స్పిన్నర్ భాగమైంది.
కాగా ఈ మ్యాచ్‌లో భారత్ కేవలం ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో మాత్రమే బరిలోకి దిగింది. అమన్ జ్యోత్ కౌర్, క్రాంతి గౌడ్ పేస్ బౌలర్లగా ఉన్నారు. మొత్తం ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు.
శ్రీలంక మహిళల ప్లేయింగ్ XI: చమరి అతపత్తు(కెప్టెన్), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, విష్మి గుణరత్నే, కవిషా దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని(వికెట్ కీపర్), అచ్చిని కులసూర్య, సుగండిక కుమారి, ఉదేశిక ప్రబోధని, ఇనోకా రనవీర
భారత మహిళల తుది జట్టు : ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, స్నేహ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి