హర్మన్‌ ప్రీత్‌ విధ్వంసం.. ముంబై ఇండియన్స్‌ భారీ స్కోర్‌ | Harmanpreet Kaur and Nat Sciver-Brunt took MI to a Huge Total | Sakshi
Sakshi News home page

WPL 2026: హర్మన్‌ ప్రీత్‌ విధ్వంసం.. ముంబై ఇండియన్స్‌ భారీ స్కోర్‌

Jan 10 2026 9:23 PM | Updated on Jan 11 2026 10:45 AM

Harmanpreet Kaur and Nat Sciver-Brunt took MI to a Huge Total

డ‌బ్ల్యూపీఎల్‌-2026లో భాగంగా డివై పాటిల్ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ బ్యాట‌ర్లు విధ్వంసం సృష్టించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ముంబై ఇన్నింగ్స్‌లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, నాట్ సీవర్ బ్రంట్ అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. 42 బంతులు ఎదుర్కొన్న హర్మన్‌ 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. స్కీవర్‌ 46 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 70 పరుగులు చేసింది. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఇక ఢిల్లీ బౌలర్లలో అరంగేట్ర పేసర్‌ నందిని శర్మ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆమె 3 ఓవర్లలో 26 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టింది. శ్రీచరణి ఒక వికెట్‌ తీసినప్పటికి తన 4 ఓవర్ల కోటాలో 45 పరుగులు సమర్పించుకుంది.

తుది జట్లు
ఢిల్లీ క్యాపిటల్స్: షఫాలీ వర్మ, లిజెల్ లీ(వికెట్‌కీపర్‌), లారా వోల్వార్డ్ట్, జెమిమా రోడ్రిగ్స్(కెప్టెన్‌), మారిజాన్ కాప్, నికి ప్రసాద్, చినెల్లే హెన్రీ, స్నేహ రాణా, మిన్ను మణి, శ్రీ చరణి, నందనీ శర్మ

ముంబై ఇండియన్స్: అమేలియా కెర్, జి కమలిని(వికెట్ కీపర్‌), నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్‌), నికోలా కారీ, సజీవన్ సజన, అమన్‌జోత్ కౌర్, పూనమ్ ఖేమ్నార్, త్రివేణి వశిష్ట, షబ్నిమ్ ఇస్మాయిల్, సంస్కృతి 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement