
భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ (Deepthi Sharma) చరిత్ర సృష్టించింది. వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో అర్ద సెంచరీతో పాటు మూడు వికెట్లు తీసిన తొలి భారత ప్లేయర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025లో (ICC Women's World Cup 2025) భాగంగా నిన్న (సెప్టెంబర్ 30) శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో (India vs Sri Lanka) దీప్తి ఈ ఘనత సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌లో జట్టుకు చాలా ముఖ్యమైన అర్ద సెంచరీ (53) సాధించి, అనంతరం బౌలింగ్‌లోనూ సత్తా చాటి 3 వికెట్లు (10-1-54-3) తీసింది. దీప్తితో పాటు అమన్‌జోత్ కౌర్ (57, 6-0-37-1), స్నేహ్ రాణా (28 నాటౌట్, 10-0-32-2) కూడా రాణించడంతో ఈ మ్యాచ్‌లో భారత్ శ్రీలంకపై ఘన విజయం సాధించింది.
124 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశలో దీప్తి వ్యక్తిగతంగా రాణించడమే కాకుండా టెయిలెండర్లతో అమూల్యమైన భాగస్వామ్యాలు నెలకొల్పింది. అమన్‌జోత్‌తో కలిసి ఏడో వికెట్‌కు 103 పరుగులు, స్నేహ్ రాణాతో ఎనిమిదో వికెట్‌కు 42 పరుగులు జోడించి భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించింది.
అనంతరం బౌలింగ్‌లో అతి కీలకమైన చమారీ ఆటపట్టు (43) వికెట్‌తో పాటు కవిష దిల్హరి (15), వికెట్‌కీపర్ అనుష్క సంజీవని (6) వికెట్లు తీసి శ్రీలంకను చావుదెబ్బ కొట్టింది. శ్రీలంకపై గెలుపుతో టీమిండియా 2025 ప్రపంచ కప్‌ను ఘనంగా ప్రారంభించింది. ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 5న కొలొంబో వేదికగా జరుగనుంది.
స్కోర్ వివరాలు..
భారత్- 269/8- వర్షం కారణంగా మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు
శ్రీలంక- 211 ఆలౌట్- డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 59 పరుగుల తేడాతో భారత్ విజయం
రెండో స్థానానికి ఎగబాకిన దీప్తి
ఈ మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన అనంతరం దీప్తి శర్మ మరో ఘనత కూడా సాధించింది. వన్డేల్లో రెండో అత్యధిక వికెట్లు సాధించిన భారత మహిళా క్రికెటర్‌గా నిలిచింది. ఈ క్రమంలో నీతూ డేవిడ్‌ను వెనక్కు నెట్టింది. ఈ జాబితాలో జులన్ గోస్వామి టాప్‌లో ఉంది.
భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు..
255 - జులన్ గోస్వామి
143 - దీప్తి శర్మ
141 - నీతూ డేవిడ్
100 - నూషిన్ అల్ ఖదీర్
99 - రాజేశ్వరి గైక్వాడ్
చదవండి: IND VS AUS: విధ్వంసకర శతకం.. చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ