 
							మహిళల వన్డే ప్రపంచకప్ చరిత్రలో టీమిండియా అద్భుతం సృష్టించింది.
 
							అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని సుసాధ్యం చేస్తూ, డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఫైనల్లోకి అడుగుపెట్టింది.
 
							నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా గురువారం జరిగిన సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో భారత్ చారిత్రక విజయం సాధించింది.
 
							జెమీమా రోడ్రిగ్స్ (127 నాటౌట్) అద్భుత సెంచరీతో చెలరేగడంతో, 339 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ మరో ఓవర్ మిగిలి ఉండగానే 341/5 స్కోరుతో ఛేదించింది.
 
							ఈ విజయంతో భారత్ మూడోసారి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరగా, ఆస్ట్రేలియా 15 మ్యాచ్‌ల విజయ పరంపరకు తెరపడింది. అంతేకాకుండా, మహిళల, పురుషుల వన్డే ప్రపంచకప్ నాకౌట్ చరిత్రలోనే ఇది అత్యధిక విజయవంతమైన ఛేదనగా రికార్డు సృష్టించింది.
 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							
 
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
