breaking news
Amanjot Kaur
-
మహిళల వన్డే ప్రపంచకప్ : శ్రీలంకపై భారత్ ఘనవిజయం (ఫొటోలు)
-
దీప్తి ఆల్‌రౌండ్ షో
గువాహటి: సొంతగడ్డపై అట్టహాసంగా ఆరంభమైన వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. బ్యాటింగ్‌లో అర్ధసెంచరీ సాధించిన దీప్తి శర్మ బౌలింగ్‌లో కీలక వికెట్లతో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచింది. దీంతో మంగళవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 59 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్... వర్షం వల్ల కుదించిన 47 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీప్తి శర్మ (53 బంతుల్లో 53; 3 ఫోర్లు), అమన్‌జోత్ కౌర్ (56 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్), రాణించారు. లంక బౌలర్లలో ఇనొక రణవీర 4 వికెట్లు, ప్రబోధని 2 వికెట్లు తీశారు. అనంతరం దిగిన శ్రీలంక 45.4 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ చమరి ఆటపట్టు (47 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుగ్గా ఆడింది. దీప్తి (3/54) సహా భారత బౌలర్లు స్నేహ్ రాణా (2/32), ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శ్రీచరణి (2/37), క్రాంతి (1/41), అమన్‌జోత్ (1/37), ప్రతిక (1/6) సమష్టిగా ప్రత్యర్థి బ్యాటర్ల భరతం పట్టారు. అమన్‌జోత్‌తో నడిపించి... బౌలింగ్‌తో గెలిపించి... భారత వెటరన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఆల్‌రౌండ్ షోకు శ్రీలంక కుదేలైంది. ప్రతీక (37; 3 ఫోర్లు, 1 సిక్స్), హర్లీన్ డియోల్ (64 బంతుల్లో 48; 6 ఫోర్లు) మెరుగ్గా ఆడినప్పటికీ మరోవైపు కీలక స్టార్లు స్మృతి మంధాన (8), హర్మన్‌ప్రీత్ (21), జెమీమా (0), రిచా ఘోష్ (2) విఫలమవడంతో 124/6 స్కోరు వద్ద భారత్ పనైపోయిందనిపించింది. ఈ దశలో దీప్తి, అమన్‌జోత్‌తో కలిసి భారత్‌ను నడిపించింది. లంక అమ్మాయిల చెత్త ఫీల్డింగ్‌తో అమన్‌జోత్ మూడుసార్లు 18, 37, 50 పరుగుల వ్యక్తిగత స్కోర్ల వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడింది. ఇద్దరు అర్ధసెంచరీ పూర్తి చేసుకొని జట్టును ఒడ్డుకు చేర్చారు. ఏడో వికెట్‌కు 99 బంతుల్లో 103 పరుగులు జోడించాక ముందుగా అమన్‌జోత్, అనంతరం దీప్తి అవుటయ్యారు. ఆఖర్లో స్నేహ్ రాణా (15 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించింది. తర్వాత కష్టమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయి ఓటమిని ఆహ్వానించింది. ఓపెనర్, కెపె్టన్ చమరి ఆటపట్టు, వన్‌డౌన్ బ్యాటర్ హర్షిత (29; 3 ఫోర్లు), మిడిలార్డర్లో నీలాక్షిక సిల్వా (29 బంతుల్లో 35; 4 ఫోర్లు; 1 సిక్స్) మెరుగ్గా ఆడారంతే! మిగతా బ్యాటర్లను భారత బౌలింగ్ దళం క్రీజులో నిలువనీయలేదు.స్కోరు వివరాలుభారత మహిళల ఇన్నింగ్స్: ప్రతిక రావల్ (సి) విష్మి (బి) ఇనొక 37; స్మృతి మంధాన (సి) విష్మి (బి) ప్రబోధని 8; హర్లీన్ డియోల్ (సి) దిల్హారి (బి) ఇనొక 48; హర్మన్‌ప్రీత్ కౌర్ (సి) సంజీవని (బి) ఇనొక 21; జెమీమా రోడ్రిగ్స్ (బి) ఇనొక 0; దీప్తి శర్మ (సి) సుగంధిక (బి) అచిని 53; రిచా ఘోష్ (సి) ప్రబోధని (బి) చమరి 2; అమన్‌జోత్ (సి) విష్మి (బి) ప్రబోధని 57; స్నేహ్ రాణా (నాటౌట్) 28; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (47 ఓవర్లలో 8 వికెట్లకు) 269. వికెట్ల పతనం: 1–14, 2–81, 3–120, 4–120, 5–121, 6–124, 7–227, 8–269. బౌలింగ్: అచిని కులసూర్య 8–0–42–1, ఉదేíÙక ప్రబోధని 10–1–55–2, సుగంధిక 9–0–46–0, కవిశా దిల్హారి 8–0–51–0, ఇనొక రణవీర 9–0–46–4, చమరి 3–0–24–1. శ్రీలంక మహిళల ఇన్నింగ్స్: హాసిని (బి) క్రాంతి గౌడ్ 14; చమరి (బి) దీప్తి శర్మ 43; హర్షిత (ఎల్బీడబ్ల్యూ) (బి) శ్రీచరణి 29; విష్మి గుణరత్నే (ఎల్బీడబ్ల్యూ) (బి) అమన్‌జోత్ 11; కవిశా (సి) రిచా ఘోష్ (బి) దీప్తి 15; నీలాక్షిక (బి) స్నేహ్ రాణా 35; అనుష్క (సి) హర్మన్‌ప్రీత్ (బి) దీప్తి 6; సుగంధిక (బి) స్నేహ్ రాణా 10; అచిని (సి) స్మృతి (బి) శ్రీచరణి 17; ప్రబోధని (నాటౌట్) 14; ఇనొక రణవీర (ఎల్బీడబ్ల్యూ) (బి) ప్రతిక రావల్ 3; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (45.4 ఓవర్లలో ఆలౌట్) 211. వికెట్ల పతనం: 1–30, 2–82, 3–103, 4–105, 5–130, 6–140, 7–173, 8–184, 9–199, 10–211. బౌలింగ్: క్రాంతి గౌడ్ 9–0–41–1, అమన్‌జోత్ 6–0–37–1, స్నేహ్ రాణా 10–0–32–2, దీప్తి శర్మ 10–1–54–3, శ్రీచరణి 8–0–37–2, ప్రతిక 2.4–0–6–1. -
చరిత్ర సృష్టించిన భారత బ్యాటర్.. ప్రపంచ రికార్డు
భారత క్రికెటర్ రిచా ఘోష్ (Richa Ghosh) సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక స్ట్రైక్‌రేటుతో వెయ్యి పరుగుల మైలురాయికి చేరుకున్న తొలి ప్లేయర్‌గా నిలిచింది. ఇంగ్లండ్‌తో రెండో టీ20 (England Women vs India Women) సందర్భంగా రిచా ఘోష్ ఈ ఘనత సాధించింది.కాగా భారత మహిళల క్రికెట్ జట్టు ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాటింగ్‌హామ్‌లో ఆతిథ్య జట్టును 97 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్.. తాజాగా రెండో టీ20లోనూ అదరగొట్టింది.బ్రిస్టల్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 24 పరుగుల తేడాతో నాట్ సీవర్-బ్రంట్ బృందాన్ని ఓడించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యం సంపాదించింది.దంచికొట్టిన అమన్‌జోత్, రిచాఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (13), షెఫాలీ వర్మ (3) నిరాశపరిచినా.. వన్‌డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ అద్భుత అర్ధ శతకం (41 బంతుల్లో 63)తో మెరిసింది.ఇక రెండో టీ20తో తిరిగి వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (1) తీవ్రంగా నిరాశపరచగా.. ‘ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్’ అమన్‌జోత్ కౌర్, వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ దంచికొట్టారు. అమన్‌జోత్ 40 బంతుల్లో తొమ్మిది ఫోర్ల సాయంతో 63 పరుగులతో అజేయంగా నిలిచింది. మరోవైపు.. రిచా ఘోష్ 20 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 32 పరుగులతో నాటౌట్‌గా ఉంది.తొలి మహిళా క్రికెటర్‌గా ప్రపంచ రికార్డుఈ క్రమంలోనే రిచా అరుదైన రికార్డులు తన సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ సందర్భంగా వెయ్యి పరుగుల మార్కు అందుకున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 140కి పైగా స్ట్రైక్‌రేటుతో ఈ ఘనత సాధించింది. తద్వారా మహిళల అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో (T20 Format) ఈ ఫీట్ నమోదు చేసిన తొలి క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు సాధించింది.ఫాస్టెస్ట్ 1000.. రెండో ప్లేయర్గాఅదే విధంగా.. ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్లో బంతుల పరం (702)గా అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న రెండో మహిళా క్రికెటర్‌గానూ రిచా ఘోష్ నిలిచింది. అంతకుముందు ఐల్ ఆఫ్ మ్యాన్‌కు చెందిన లూసీ బార్నెట్ 700 బంతుల్లో ఈ ఘనత సాధించింది.కాగా పదహారేళ్ల వయసులో 2020లో రిచా టీమిండియా తరఫున టీ20లలో అరంగేట్రం చేసింది. ఇప్పటికి 64 మ్యాచ్‌లలో కలిపి 1029 పరుగులు సాధించింది. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. అంతేకాదు.. 21 ఏళ్ల రిచా 37 వన్డేల్లో 800, రెండు టెస్టు మ్యాచ్‌లలో కలిపి 151 పరుగులు సాధించింది.ఇంగ్లండ్‌ను మరోసారి ఓడించిన భారత్ఇక ఇంగ్లండ్‌తో రెండో టీ20 విషయానికొస్తే.. భారత్ విధించిన 182 లక్ష్యాన్ని ఛేదించడంలో ఆతిథ్య జట్టు విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసిన ఇంగ్లండ్ 24 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. టామీ బీమౌంట్ హాఫ్ సెంచరీ (54) చేయగా.. మిగతా వారిలో ఎమీ జోన్స్ (32), సోఫీ ఎక్లిస్టోన్ (35) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.భారత బౌలర్లలో శ్రీ చరణి రెండు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. స్నేహ్ రాణా- రాధా యాదవ్, స్మృతి మంధాన- రిచా ఘోష్ జోడీలు రెండు రనౌట్లలో భాగమయ్యాయి.అత్యుత్తమ స్ట్రైక్‌రేటుతో మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్లు🏏రిచా ఘోష్ (ఇండియా)- 143.11 స్ట్రైక్‌రేటుతో 1029 రన్స్🏏లూసీ బార్నెట్ (ఐల్ ఆఫ్ మ్యాన్)- 139.69 స్ట్రైక్‌రేటుతో 1172 రన్స్🏏తాహిలా మెగ్రాత్ (ఆస్ట్రేలియా)- 132.94 స్ట్రైక్‌రేటుతో 132.94 రన్స్🏏క్లో టైరాన్ (సౌతాఫ్రికా)- 132.81 స్ట్రైక్‌రేటుతో 1283 రన్స్🏏అలీసా హేలీ (ఆస్ట్రేలియా)- 129.79 స్ట్రైక్‌రేటుతో 3208 రన్స్చదవండి: సెంచరీ, 6 వికెట్ల ప్రదర్శన.. ఇంగ్లండ్‌లో టీమిండియా యువ సంచలనం ఆల్‌రౌండ్ షో -
ENG W Vs IND W : ఇంగ్లండ్‌పై భారత్ ఘన విజయం
బ్రిస్టల్: బ్యాటర్లు జెమీమా రోడ్రిగ్స్ (41 బంతుల్లో 63; 9 ఫోర్లు, 1 సిక్స్), అమన్‌జ్యోత్ కౌర్ (40 బంతుల్లో 63 నాటౌట్; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. ఫలితంగా ఇంగ్లండ్‌తో రెండో టి20లో భారత మహిళల క్రికెట్ జట్టు మెరుగైన ప్రదర్శన చేసింది. కాగా ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా మంగళవారం రెండో మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. రిచా ఘోష్ (20 బంతుల్లో 32 నాటౌట్; 6 ఫోర్లు) ధాటిగా ఆడింది. గత మ్యాచ్‌లో సెంచరీతో విజృభించిన స్మృతి మంధాన (13; 2 ఫోర్లు), షఫాలీ వర్మ (3), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (1) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో లౌరెన్‌బెల్ 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి కేవలం 157 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా భారత్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో టామీ బీమౌంట్ అర్ధ శతకం (54)తో రాణించగా.. మిగిలిన వారిలో ఎమీ జోన్స్ (32), సోఫీ ఎక్లిస్టోన్ (35) మాత్రమే ఫర్వాలేదనిపించారు. ఇక భారత బౌలర్లలో శ్రీ చరణి రెండు వికెట్లు దక్కించుకోగా.. దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించిన అమన్‌జోత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.