
గువాహటి: సొంతగడ్డపై అట్టహాసంగా ఆరంభమైన వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది.

బ్యాటింగ్‌లో అర్ధసెంచరీ సాధించిన దీప్తి శర్మ బౌలింగ్‌లో కీలక వికెట్లతో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచింది. దీంతో మంగళవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 59 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్... వర్షం వల్ల కుదించిన 47 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది.



















