చ‌రిత్ర సృష్టించిన టీమిండియా.. ఆసీస్ వరల్డ్ రి​కార్డు బ్రేక్‌ | India Women Beat New Zealand by 53 Runs, Reach ICC Women’s World Cup 2025 Semifinals | Sakshi
Sakshi News home page

చ‌రిత్ర సృష్టించిన టీమిండియా.. ఆసీస్ వరల్డ్ రి​కార్డు బ్రేక్‌

Oct 24 2025 12:53 PM | Updated on Oct 24 2025 1:08 PM

 India Breaks Australias World Record; Becomes First Team In History

ఐసీసీ మహిళల ప్రపంచకప్‌-2025లో భారత జట్టు సెమీఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా.. తమ సెమీస్‌ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో హర్మన్‌ సేన ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టింది.

వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన మన అమ్మాయిల జట్టు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లకు 340 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో స్మృతి మంధాన(109), ప్రతికా రావల్(122) అద్భుతమైన సెంచరీలతో సత్తాచాటగా.. జెమీమా రోడ్రిగ్స్‌ (76 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది.

అనంతరం మళ్లీ వర్షం అంతరాయం కలిగించడంతో కివీస్ లక్ష్యాన్ని 44 ఓవర్లలో 325గా నిర్ణయించారు. కానీ న్యూజిలాండ్ లక్ష్య చేధనలో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 271 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఈ ఓటమితో కివీస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ మ్యాచ్‌లో అదరగొట్టిన భారత మహిళల జట్టు ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. 

ఆసీస్‌ రికార్డు బ్రేక్‌..
మ‌హిళ‌ల వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో న్యూజిలాండ్‌పై అత్య‌ధిక స్కోర్ సాధించిన జ‌ట్టుగా భార‌త్ నిలిచింది. ఇంత‌కుముందు ఈ రికార్డు ఆసీస్ పేరిట ఉండేది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప్ర‌పంచ‌క‌ప్‌లోనే ఇండోర్ వేదిక‌గా కివీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 326 ప‌రుగులు చేసింది. తాజా మ్యాచ్‌లో 340 ర‌న్స్ చేసిన టీమిండియా.. ఆసీస్ రికార్డును బ్రేక్ చేసింది.
చదవండి: రోహిత్ నీకు ఇది ఫేర్‌వెల్‌ మ్యాచా? ఒక్క ఫోటో అయినా పెట్టు: గంభీర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement