అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓటమి పాలైనప్పటికి.. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం ఆకట్టుకున్నాడు. తొలి వన్డేలో విఫలమైన హిట్‌మ్యాన్ రెండో మ్యాచ్‌లో తన మార్క్ చూపించాడు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన రోహిత్ క్రీజులో నిలదొక్కున్నాక మాత్రం తనదైన స్టైల్లో బ్యాటింగ్ చేస్తూ అలరించాడు.
ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన జట్టు తన అద్బుత ఇన్నింగ్స్‌తో రోహిత్ ఆదుకున్నాడు. శ్రేయస్ అయ్యర్‌తో కలిసి మూడో వికెట్‌కు 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 97 బంతుల్లో 7 ఫోర్లు, రెండు సిక్సర్లతో 73 పరుగులు చేసిన రోహిత్ శర్మ స్టార్క్ బౌలింగ్‌లో బౌండరీ వద్ద క్యాచ్ రూపంలో అవుటయ్యాడు. అయితే మ్యాచ్ ముగిశాక టీమ్ హోటల్‌కు వెళ్లే క్రమంలో రోహిత్ శర్మను భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆటపట్టించాడు.
"రోహిత్.. అందరికీ ఇదే నీ ఫేర్‌వెల్ మ్యాచ్ అనిపిస్తోంది. ఒక్క ఫొటో అయినా పెట్టు" అని గంభీర్ అన్నాడు. అందుకు రోహిత్ నవ్వుతూ తన రూమ్‌కు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఆసీస్ టూర్‌కు ముందు వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తప్పించిన సంగతి తెలిసిందే.
దీంతో రోహిత్ అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తుపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పటికే టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన హిట్‌మ్యాన్ కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే వన్డే ప్రపంచకప్-2027లో రోహిత్ ఆడుతాడా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ కూడా ఎటువంటి స్పష్టత లేదు.
వరల్డ్‌కప్‌నకు ఇంకా రెండేళ్ల సమయం ఉండడంతో అప్పటికి ఈ ముంబై ఆటగాడి వయస్సు నాలభైకి చేరుకుంటుంది. ఒకవేళ రోహిత్ ఫిట్‌గా ఉండి, ఫామ్‌లో ఉంటే వరల్డ్‌కప్‌లో ఆడే అవకాశముంది. అంతేకాకుండా వరల్డ్‌కప్ జట్టు ఎంపికకు అందుబాటులో ఉండాలంటే దేశవాళీ టోర్నీ విజయహాజారే ట్రోఫీలో ఆడాల్సిందేనని అగార్కర్ స్పష్టం చేశాడు. ఇక ఇరు జట్ల మధ్య మూడో వన్డే సిడ్నీ వేదికగా శనివారం జరగనుంది.
చదవండి: వరుసగా రెండుసార్లు డకౌట్.. కోహ్లి రిటైర్మెంట్?.. గావస్కర్ స్పందన ఇదే


