టీమిండియా మాజీ వికెట్‌కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్‌కు మరో కీలక పదవి దక్కింది. ద హండ్రెడ్ లీగ్ 2026 సీజన్ కోసం పురుషుల లండన్ స్పిరిట్ ఫ్రాంచైజీకి బ్యాటింగ్ కోచ్ మరియు మెంటర్‌గా ఎంపికయ్యాడు. హండ్రెడ్ లీగ్‌లో డీకే ఏ ఫ్రాంచైజీతో అయిన పని చేయడం (కోచ్‌గా) ఇదే మొదటిసారి.
డీకే 2025 ఐపీఎల్ సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో బ్యాటింగ్ కోచ్ మరియు మెంటర్‌గా చేరి, ఆ జట్టు మొదటి సారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అదే పోర్ట్‌ఫోలియోతో లండన్ స్పిరిట్‌తోనూ జతకట్టాడు.
లండన్ స్పిరిట్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మో బోబాట్ (ఆర్సీబీ డైరెక్టర్ కూడా) డీకేను స్వాగతిస్తూ.. ఈ టీ20 ఫార్మాట్ స్పెషలిస్ట్ లండన్ స్పిరిట్‌లో చేరడం ఆనందకరం. అతని ఆలోచన విధానం ప్రత్యేకం. పొట్టి ఫార్మాట్లో డీకేకు ఉన్న అనుభవం, అతని ఉత్సాహం మా ఆటగాళ్లకు అమూల్యమవుతుందని అన్నారు.
లండన్ స్పిరిట్‌తో ఒప్పందం అనంతరం డీకే భావోద్వేగానికి లోనయ్యాడు. లార్డ్స్‌లో ఇంగ్లీష్ సమ్మర్ గడపనుండటం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇదే గ్రౌండ్‌లో నేను భారత్ తరఫున తొలి మ్యాచ్ ఆడాను. చివరి టెస్ట్ కూడా ఇక్కడే ఆడాను. లండన్ స్పిరిట్‌తో కొత్త ప్రయాణం ప్రారంభించడం చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుందని అన్నాడు.
40 ఏళ్ల దినేశ్ కార్తీక్ భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 180 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అలాగే ఐపీఎల్‌లో ప్రారంభ సీజన్ (2008) నుంచి 2024 ఎడిషన్ వరకు ఆడాడు. ఈ మధ్యలో అతను వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున 257 మ్యాచ్‌లు ఆడాడు.


