కటక్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సౌతాఫ్రికా బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో కేవలం 74 పరుగులకే ఆలౌటయ్యారు. ఈ మ్యాచ్‌లో 101 పరుగుల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 అధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. హార్దిక్ పాండ్యా, శివ దూబే చెరో వికెట్ తీశారు.
అంతకుముందు భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో అభిషేక్ శర్మ 17, శుభ్‌మన్ గిల్ 4, సూర్యకుమార్ యాదవ్ 12, తిలక్ వర్మ 26, అక్షర్ పటేల్ 23, శివమ్ దూబే 11, జితేశ్ శర్మ 10 (నాటౌట్) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీయగా.. సిపాంమ్లా 2, ఫెరియెరా ఓ వికెట్ పడగొట్టాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో టీ20 ముల్లాన్‌పూర్ వేదికగా గురువారం జరగనుంది.


