డిసెంబర్ 21 నుంచి స్వదేశంలో శ్రీలంకతో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత మహిళల క్రికెట్ జట్టును ఇవాళ (డిసెంబర్ 9) ప్రకటించారు. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధన కొనసాగనున్నారు. వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించిన తర్వాత భారత్ ఆడనున్న తొలి సిరీస్ ఇదే.
పలాష్ ముచ్చల్‌తో పెళ్లి పెటాకులైన తర్వాత మంధన ఎదుర్కోనున్న తొలి పరీక్ష కూడా ఇదే. వరల్డ్‌కప్ స్టార్ షఫాలీ వర్మ ఈ జట్టులో ప్రత్యేక ఆకర్శనగా నిలిచింది.
అలాగే వరల్డ్‌కప్ సెమీఫైనల్ స్టార్ జెమీమా రోడ్రిగ్స్, వరల్డ్‌కప్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ దీప్తి శర్మ, స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్, అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్ లాంటి వరల్డ్‌కప్ స్టార్లు కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. వికెట్‌కీపర్ల కోటాలో రిచా ఘోష్, జి కమలిని జట్టులో ఉన్నారు. కొత్తగా శ్రీ చరణి, వైష్ణవి శర్మ జట్టులోకి వచ్చారు.
షెడ్యూల్..
తొలి టీ20- డిసెంబర్ 21, ఆదివారం, విశాఖపట్నం
రెండో టీ20- డిసెంబర్ 23, మంగళవారం, విశాఖపట్నం
మూడో టీ20- డిసెంబర్ 26, శుక్రవారం, తిరువనంతపురం
నాలుగో టీ20- డిసెంబర్ 28, ఆదివారం, తిరువనంతపురం
ఐదో టీ20- డిసెంబర్ 30, మంగళవారం, తిరువనంతపురం


