
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైనప్పటికి... కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రం అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. 288 పరుగుల భారీ లక్ష్య చేధనలో టీమిండియా ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన హర్మన్.. మరో సీనియర్ ప్లేయర్ స్మృతి మంధానతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. మొత్తంగా 70 బంతులు ఎదుర్కొన్న కౌర్.. 10 ఫోర్ల సాయంతో 70 పరుగులు చేసింది. మంధానతో కలిసి వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పి గెలుపు బాట వేసింది. కానీ తర్వాత వచ్చిన బ్యాటర్లు చేతులెత్తేయండంతో భారత్ పరాజయం చవిచూడాల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడిన హర్మన్ ప్రీత్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది.
హర్మన్ సాధించిన రికార్డులు ఇవే..
👉మహిళల ప్రపంచకప్ చరిత్రలో 1000 పరుగులు పూర్తి చేసిన రెండో భారత ప్లేయర్‌గా ఆమె నిలిచింది. ఆమె కెరీర్‌లో ఇది ఐదవ ప్రపంచకప్. ఇప్పటివరకు హర్మన్ 31 మ్యాచ్‌లలో 1017 పరుగులు సాధించింది. ఇందులో మూడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఫీట్ హర్మన్ కంటే మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సాధించింది. ఓవరాల్‌గా ఈ జాబితాలో హర్మన్ ఏడో స్దానంలో ఉంది.
👉అదేవిధంగా మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో నెంబర్ 4 లేదా అంతకంటే తక్కువ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి 1000 పరుగుల మైలురాయిని చేరిన తొలి ప్లేయర్‌గా ప్రపంచరికార్డు హర్మన్ నెలకొల్పింది.
👉మహిళల వన్డేల్లో నాలుగో స్థానం లేదా అంతకంటే తక్కువ స్థానంలో (4289) అత్యధిక పరుగులు చేసిన జాబితాలో హర్మన్‌ప్రీత్ అగ్రస్థానంలో ఉంది. నాట్ స్కైవర్ 4205 పరుగులతో రెండవ స్థానంలో ఉంది.
చదవండి: మా ఓటమికి కారణమదే.. చాలా బాధగా ఉంది: టీమిండియా కెప్టెన్