ఉమెన్ ప్రీమియర్ లీగ్-2026 వేలం సందర్భంగా ముంబయి ఇండియన్స్ అధినేత, రిలయన్స్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ న్యూఢిల్లీకి చేరుకున్నారు. డబ్ల్యూపీఎల్ ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌తో కలిసి ఆమె వేలంపాటలో పాల్గొనేందుకు వచ్చారు. తొలి రెండు సీజన్లలో విజయం సాధించి డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబయి ఇండియన్స్ (MI) టీమ్‌లోకి వచ్చే ఆటగాళ్లు ఎవరనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
ఫ్రాంచైజీకి ఆదాయం ఎలాగంటే..
సెంట్రల్ రెవెన్యూ పూల్ అన్ని ఫ్రాంచైజీలకు ప్రధాన ఆదాయ వనరు. ఇందులో టోర్నమెంట్‌ను ప్రసారం చేసే హక్కుల (టీవీ, డిజిటల్) ద్వారా వచ్చే ఆదాయంలో ఒక భాగాన్ని అన్ని ఫ్రాంచైజీలకు పంచుతారు. Viacom18/JioStar వంటి సంస్థలు భారీ మొత్తంలో మీడియా హక్కుల కోసం డబ్బు చెల్లిస్తాయి. ఇందులో ముంబై ఇండియన్స్ కూడా వాటాను పొందుతుంది.
లీగ్‌కు సంబంధించిన టైటిల్ స్పాన్సర్, ప్రీమియర్ భాగస్వాముల నుంచి వచ్చే ఆదాయం ఫ్రాంచైజీల మధ్య పంపిణీ చేస్తారు. ఛాంపియన్‌గా ముంబై ఇండియన్స్ విజయాలు ఈ రెవెన్యూ పూల్ విలువను పెంచడానికి దోహదపడతాయి.
ఫ్రాంచైజీ స్పాన్సర్‌షిప్‌లు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు జట్టుకు నేరుగా వచ్చే ఆదాయ వనరులు. ఇప్పటికే రెండు టైటిల్స్‌ను గెలుచుకున్న ముంబయి ఇండియన్స్ బ్రాండ్‌లను ఆకర్షించడంలో ముందుంటుంది.
జెర్సీపై (ముందు, వెనుక, భుజాలు) ప్రధాన స్పాన్సర్‌ల లోగోలను ఉంచడం ద్వారా ఆదాయం వస్తుంది.
ఎక్విప్‌మెంట్, కిట్ పార్టనర్షిప్‌ల ద్వారా (బ్యాట్లు, ప్యాడ్లు) ఒప్పందాలుంటాయి. ఇది కూడా జట్టు ఆదాయానికి దోహదం చేస్తుంది.
అసోసియేట్ స్పాన్సర్‌లు డిజిటల్ రైట్స్, ఫ్యాన్ ఎంగేజ్‌మెంట్, ఇతర ప్రమోషనల్ కార్యకలాపాల కోసం స్పాన్సర్ చేస్తారు.
జట్టు జెర్సీలు, టోపీలు, టీ-షర్టులు, ఇతర వస్తువుల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం అదనం.
డబ్ల్యూపీఎల్ ప్రాచుర్యం పెరుగుతున్న కొద్దీ టికెట్ ఆదాయం కూడా పెరుగుతుంది. ఇందులోనూ జట్లకు ఆదాయం ఉంటుంది.
ఇదీ చదవండి: ‘కేంద్రం లేబర్ కోడ్స్ మాకొద్దు’.. అందులో ఏముంది?


