42 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 95
చివరి ఓవర్లో 2 వికెట్లు
గుజరాత్ జెయింట్స్‌ను గెలిపించిన కివీస్ క్రికెటర్
నందిని శర్మ ‘హ్యాట్రిక్’ వృథా
ఢిల్లీ క్యాపిటల్స్‌కు రెండో ఓటమి
ముంబై: ఆధిక్యం చేతులు మారుతూ సాగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌ను విజయం వరించింది. మహిళల ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆదివారం పరుగుల వరద పారిన పోరులో గుజరాత్ 4 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. మొదట గుజరాత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ సోఫీ డివైన్ (42 బంతుల్లో 95; 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగి త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... కెపె్టన్ ఆష్లే గార్డ్‌నర్ (26 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా దంచికొట్టింది. ఢిల్లీ బౌలర్లలో నందిని శర్మ (5/33) ‘హ్యాట్రిక్’తో సహా 5 వికెట్లుపడగొట్టగా... తెలుగమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి (2/42), చినెల్లి హెన్రీ (2/43) చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులకు పరిమితమై వరుసగా రెండో ఓటమి చవిచూసింది.
లిజెల్లి లీ (54 బంతుల్లో 86; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు), లారా వోల్వార్ట్ (38 బంతుల్లో 77; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. ఆరంభంలో లిజెల్లి చెలరేగిపోగా... విజయానికి 24 బంతుల్లో 60 పరుగులు అవసరమైన దశలో వోల్వార్ట్ కదంతొక్కింది. వోల్వార్ట్ 17వ ఓవర్‌లో 2 ఫోర్లు... 18వ ఓవర్‌లో 4, 4, 4, 6 కొట్టింది. దీంతో సమీకరణం 12 బంతుల్లో 29కి చేరింది. 19వ ఓవర్‌లో వోల్వార్ట్ 6, 4, జెమీమా ఫోర్‌తో 22 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్‌లో ఢిల్లీ విజయానికి 7 పరుగులు అవసరం కాగా... 2 పరుగులే ఇచి్చన సోఫీ డివైన్ 2 వికెట్లు తీసి గుజరాత్‌కు వరుసగా రెండో విజయం కట్టబెట్టింది.
ఒకే ఓవర్‌లో 4,4,6,6,6,6 గుజరాత్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో సోఫీ డివైన్ విజృంభించింది. స్నేహ్ రాణా వేసిన ఆ ఓవర్ తొలి రెండు బంతులకు ఫోర్లు బాదిన డివైన్... ఆ తర్వాత వరుసగా నాలుగు సిక్స్‌లు కొట్టింది. దీంతో ఒక్క ఓవర్‌లోనే 32 పరుగులు వచ్చాయి. డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్‌లో లభించిన అత్యధిక పరుగులు ఇవే. క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించిన డివైన్... శ్రీచరణి ఓవర్‌లో సైతం మూడు సిక్స్‌లు బాదింది. మరో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో సెంచరీకి ఐదు పరుగుల దూరంలో అవుటైంది.
నందిని ‘హ్యాట్రిక్’ ఫుల్‌ఫామ్‌లో ఉన్న డివైన్‌ను అవుట్ చేసిన నందిని శర్మ... ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ‘హ్యాట్రిక్’తో సహా నాలుగు వికెట్లు పడగొట్టింది. రెండో బంతికి కాశ్వీ గౌతమ్ (14) అవుట్ కాగా... నాలుగో బంతికి కనిక (4) స్టంపౌటైంది. చివరి రెండు బంతులకు రాజేశ్వరి (0), రేణుక (0) క్లీన్»ౌల్డ్ అయ్యారు. తద్వారా ఇసీ వాంగ్(2023), దీప్తి శర్మ (2024), గ్రేస్ హారిస్ (2025) తర్వాత డబ్ల్యూపీఎల్‌లో ‘హ్యాట్రిక్’ తీసిన నాలుగో బౌలర్‌గా నందిని నిలిచింది.


