మహిళల ప్రీమియర్ లీగ్ నుంచి మరో యువ సంచలనం క్రికెట్ ప్రపంచానికి పరిచయమైంది. డబ్ల్యూపీఎల్-2026 సీజన్‌లో శనివారం యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ తరపున బరిలోకి దిగిన అనుష్క శర్మ.. తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టింది.
బెత్ మూనీ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన 22 ఏళ్ల అనుష్క తన సంచలన బ్యాటింగ్‌తో అందరిని ఆశ్చర్యపరిచింది. శిఖా పాండే, డాటిన్ వంటి అంతర్జాతీయ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ఆమె ఔరా అన్పించింది. అస్సలు తొలి మ్యాచ్ ఆడుతున్నాన్న ఒత్తడి కొంచెం కూడా ఆమెలో కన్పించలేదు.
కెప్టెన్ యాష్లీ గార్డరన్‌తో కలిసి 103 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అనుష్క నెలకొల్పింది. గుజరాత్ 207 పరుగుల భారీ స్కోర్ సాధించడంలో ఈ భాగస్వామ్యం కీలకంగా మారింది. అనుష్క 30 బంతులు ఎదుర్కొని 7 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసింది. ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆడిన అనుష్క గురుంచి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.
ఎవరీ అనుష్క శర్మ..?
ఆమె అసలు పేరు అనుష్క బ్రిజ్మోహన్ శర్మ. అనుష్క దేశవాళీ క్రికెట్‌లో మధ్యప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహించింది. ఆమెకు చిన్నతనం నుంచి క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. అనుష్క తన అన్నయ్య ఆయుష్ శర్మను చూసి క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. ఆయుష్ కూడా ప్రొఫెషనల్ క్రికెటర్ కావడం గమనార్హం.
అతడు తన బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం తన సోదరితో బౌలింగ్ చేయించేవాడంట. అనుష్క కుడిచేతి వాటం బ్యాటర్ మాత్రమే కాదు, రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలింగ్ కూడా చేయగలదు. దేశవాళీ క్రికెట్‌లో ఆమె ఇప్పటివరకు 620 పరుగులతో పాటు 22 వికెట్లు పడగొట్టింది. అనుష్క మధ్యప్రదేశ్ జట్టుతో పాటు ఇండియా-బి, ఇండియా-సి, సెంట్రల్ జోన్ వంటి జట్లకు కూడా ప్రాతినిథ్యం వహించింది. అనుష్క సీనియర్ ఉమెన్స్ టీ20 ట్రోఫీ-2025లో 207 పరుగులు చేయడంతో పాటు 9 వికెట్లు తీసి సత్తాచాటింది.
వేలంలో రికార్డు ధర..
ఈ క్రమంలోనే గతేడాది నవంబర్‌లో జరిగిన మెగా వేలంలో అనుష్కపై కాసుల వర్షం కురిసింది. ఆమెను గుజరాత్ జెయింట్స్ రూ. 45 లక్షల భారీ ధరకు కొనుగోలు చేసింది. తద్వారా ఈ ఏడాది సీజన్ వేలంలో అత్యధిక పలికిన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఆమె నిలిచింది. ఇదే తరహా ప్రదర్శలు చేస్తే అనుష్క త్వరలోనే భారత సీనియర్ జట్టులోకి వచ్చే అవకాశముంది.
చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో


