అహ్మదాబాద్: భారత్, జింబాబ్వే మధ్య మ్యాచ్‌కు ముందు జరిగే మరో సమరంపై కూడా టీమిండియా అభిమానుల దృష్టి నిలిచింది. ‘గ్రూప్–1’లోనే దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఫలితం కూడా చివర్లో భారత్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. సరిగ్గా చెప్పాలంటే ఇక్కడ దక్షిణాఫ్రికా గెలవాలని భారత్ కోరుకోవాలి.
ఈ మ్యాచ్‌తో పాటు జింబాబ్వేపై కూడా దక్షిణాఫ్రికా గెలిస్తే భారత్‌కు రన్‌రేట్ లెక్కల అవసరం రాదు. జింబాబ్వేతో పాటు చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై భారత్ గెలిస్తే సరిపోతుంది. కానీ దక్షిణాఫ్రికాపై వెస్టిండీస్ గెలిస్తే మాత్రం... మనం మిగతా రెండూ గెలిచినా సెమీఫైనల్ స్థానంపై గ్యారంటీ లేదు.
మూడు జట్లూ రెండేసి విజయాలతో సమానమైతే రన్‌రేట్‌తో దక్షిణాఫ్రికా, విండీస్‌లకు వెనక్కి నెట్టడం భారత్‌కు అంత సులువు కాదు! జింబాబ్వేతో మ్యాచ్ బరిలోకి దిగడానికి ముందు టీమిండియాకు మరింత స్పష్టత వస్తుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం


