
మహిళల ప్రపంచకప్-2025లో ఆస్ట్రేలియా జోరు కొనసాగుతోంది. ఆదివారం వైజాగ్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. 331 పరుగుల భారీ లక్ష్య చేధనలో కంగారుల కెప్టెన్ అలీసా హీలీ అద్భుత సెంచరీతో చెలరేగింది.
107 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 142 పరుగులు చేసిన హీలీ.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. ఫలితంగా భారీ టార్గెట్‌ను ఆసీస్ 49 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది. హీలీతో పాటు లీచ్ ఫీల్డ్(40), పెర్రీ(47), గార్డనర్(45) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.
భారత బౌలర్లు ఆఖరిలో పోరాడినప్పటికి జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీచరణి 41 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది.
ఆసీస్ వరల్డ్ రికార్డు..
ఈ విజయంతో ఆస్ట్రేలియా వరల్డ్ రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. మహిళల వన్డేల్లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక పేరిట ఉండేది. శ్రీలంక జట్టులో 2024లో దక్షిణాఫ్రికాపై 302 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేసింది. ఈ మ్యాచ్‌లో లంక కెప్టెన్ చమారి అటపత్తు (195* పరుగులు) భారీ శతకంతో మెరిసింది. అయితే తాజా మ్యాచ్‌తో లంక ఆల్‌టైమ్ రికార్డును ఆసీస్ బ్రేక్ చేసింది.
మహిళల వన్డే క్రికెట్‌లో హైయిస్ట్ ఛేజింగ్‌లు ఇవే..
1.ఆస్ట్రేలియా-భారత్(ప్రత్యర్ధి)-331/7
2.శ్రీలంక - దక్షిణాఫ్రికా (ప్రత్యర్ధి) -302/4
3.ఆస్ట్రేలియా -న్యూజిలాండ్ (ప్రత్యర్ధి)-289
4.ఆస్ట్రేలియా-భారత్ (ప్రత్యర్ధి)-283
5.ఆస్ట్రేలియా -భారత్ (ప్రత్యర్ధి)-282
చదవండి: చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. ఆసియాలో తొలి బ్యాటర్