
మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా గురువారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఓటమి తప్పదు అనుకున్న చోట నాడిన్ డి క్లెర్క్ అద్బుతం చేసింది. కేవలం 54 బంతుల్లోనే 84 పరుగులు చేసి ప్రోటీస్‌కు మరుపురాని విజయాన్ని అందించింది.
అయితే గెలుపు జోష్‌లో ఉన్న సౌతాఫ్రికా స్టార్ బౌలర్ నోన్కులులెకో మ్లాబాకు ఐసీసీ ఊహించని షాకిచ్చింది. తమ ప్రవర్తన నియమావళిని ఉల్లఘించినందుకు గాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చర్యలు తీసుకుంది.
ఆమె మ్యాచ్ ఫీజులో ఎటువంటి కోత విధించనప్పటికి.. ఓ డిమెరిట్ పాయింట్ మాత్రం ఆమె ఖాతాలో చేరింది. 24 నెలల్లో ఇది ఆమెకు మొదటి డీమెరిట్ పాయింట్ కాబట్టి సౌతాఫ్రికా మెనెజ్‌మెంట్ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
అసలేమి జరిగిందంటే?
ఈ మ్యాచ్‌లో మ్లాబా తన స్పిన్ మ్యాజిక్‌తో భారత టాపార్డర్‌ను దెబ్బతీసింది. స్మృతి మంధాన, హర్లీన్ డియోల్‌ను వెంటవెంటనే పెవిలియన్‌కు పంపింది. అయితే 17వ ఓవర్‌లో హర్లీన్ డియోల్‌ను ఔట్ చేసిన తర్వాత మ్లాబా ఆమె వైపు చూస్తూ “గుడ్‌బై” అంటూ తన స్టైల్లో సెలబ్రేషన్స్ చేసింది.
ఆమె మరీ అంత దూకుడుగా వ్యవహరించికపోయినప్పటికి.. ఐసీసీ మాత్రం ఆమె ప్రవర్తను కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనగా పరిగణించింది. ఈ క్రమంలోనే ఆమెను ఐసీసీ మందలించింది. ఈ మెగా టోర్నీలో మ్లాబా ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడి 6 వికెట్లు పడగొట్టింది.
చదవండి: BAN vs AFG: ఐదేసిన రషీద్ ఖాన్.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన అఫ్గాన్