ఏయూలో ఉద్రిక్తత.. ఇరువర్గాల ఘర్షణ | Student union clash at Andhra University | Sakshi
Sakshi News home page

ఏయూలో ఉద్రిక్తత.. ఇరువర్గాల ఘర్షణ

Feb 18 2026 10:53 AM | Updated on Feb 18 2026 11:23 AM

Student union clash at Andhra University

సాక్షి విశాఖపట్నం: ఏయూలో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఘర్షణ తలెత్తింది. చేతకాని వ్యక్తిని ఆంధ్ర యూనివర్సిటీ వీసీగా నియమించారని విద్యార్థి సంఘాలు ఆగ్రహాం వ్యక్తం చేశాయి. వర్సిటీ సమస్యలు పరిష్కరించడంలో వీసీ విఫలమవుతున్నారని ఆరోపించాయి. ఇరువర్గాలు పోటాపోటీగా విద్యార్థులు నినాదాలు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరస్పరం దాడి చేసుకునేందుకు యత్నించాయి.

దీంతో పరిస్థితి విషమించడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని  ఆపే యత్నం చేశారు. అనంతరం వారి సమస్యలపై  విద్యార్థి సంఘాలతో అధికారులు చర్చలు జరుపుతున్నారు. వర్సిటీలోని సెనెట్ హల్ లో పోలీసులు సమక్షంలో చర్చలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ చర్చలకు విద్యార్థి సంఘాల నాయకులు హాజరైనట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement