అత్తపై పెట్రోలు పోసి నిప్పంటించిన అల్లుడు | husband and wife incident in Palnadu District | Sakshi
Sakshi News home page

అత్తపై పెట్రోలు పోసి నిప్పంటించిన అల్లుడు

Feb 18 2026 9:52 AM | Updated on Feb 18 2026 9:56 AM

husband and wife incident in Palnadu District

పల్నాడు జిల్లా: అత్తపై అల్లుడు పెట్రోలు పోసి నిప్పంటించిన ఘటన పల్నాడు జిల్లా దాచేపల్లిలో మంగళవారం రాత్రి జరిగింది. దాచేపల్లికి చెందిన వాసం లక్ష్మిపై ఆమె అల్లుడు శ్రీనివాసపురానికి చెందిన జక్కా రవి పెట్రోలు పోసి నిప్పంటించడంతో శరీరం కొంత మేర కాలింది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోలేదు. దీంతో బాధితురాలు రోడ్డుపై బైఠాయించి             ఆందోళనకు దిగారు.  

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... తన కుమార్తె లావణ్యకు జక్కా రవితో వివాహం చేశారు. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య వివాదం జరుగుతుంది. భర్త వేధింపులు భరించలేని లావణ్య పుట్టింటికి వచ్చింది. మంగళవారం రాత్రి దాచేపల్లిలోని అత్త ఇంటికి వచ్చిన రవి అత్త, భార్యతో గొడవ పడ్డాడు. రవి తనతోపాటు తెచ్చుకున్న పెట్రోలు అత్తపై పోసి నిప్పంటించాడు. 

బాధితురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి రక్షించారు. దాడిపై  ఫిర్యాదు చేయగా, పోలీసులు పట్టించుకోలేదు.దీంతో బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి అద్దంకి –నార్కెట్‌పల్లి హైవేపై బైఠాయించి ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. 

నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. రవి కూటమి ప్రభుత్వంలో క్రియాశీలకంగా  వ్యవహరిస్తున్నారు. కూటమి నేతలు తీవ్ర ఒత్తిడి  చేయడంతో పోలీసులు కేసు నమోదు చేయలేకపోయారు. దీంతో బాధితురాలు ఆందోళన చేయాల్సి వచ్చింది.   

Advertisement
 
Advertisement
Advertisement