మదనపల్లె బాలిక హత్య కేసు నిందితుడు మృతి | Annamayya District Madanapalle Case: Accused Lost His Life | Sakshi
Sakshi News home page

మదనపల్లె బాలిక హత్య కేసు నిందితుడు మృతి

Feb 18 2026 8:54 AM | Updated on Feb 18 2026 10:23 AM

Annamayya District Madanapalle Case: Accused Lost His Life

సాక్షి, అన్నమయ్య జిల్లా: మదనపల్లె బాలిక హత్య కేసు నిందితుడు మృతిచెందాడు. కురబలకోట మండలం కరసానివారిపల్లి చెరువులో మృతదేహం లభించింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి ముదివేలు పోలీసులు చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో అదృశ్యమైన ఏడేళ్ల చిన్నారి హత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. ఆమెపై నిందితుడు లైంగికదాడి చేసి, ఆపై హత్య చేశాడు. మదనపల్లె పట్టణంలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల చిన్నారి సోమవారం సాయంత్రం ఆడుకుంటూ అదృశ్యమైంది. తల్లిదండ్రులు, బంధువులు ఎంత గాలించినా జాడ కానరాలేదు. దీంతో ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

రాత్రంతా ఎంత వెతికినా చిన్నారి ఆచూకీ లభ్యం కాలేదు. కుటుంబీకులు అనుమానంతో బాలిక ఇంటికి సమీపంలోనే ఉండే కులవర్ధన్‌ అనే వ్యక్తిపై మంగళవారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కులవర్ధన్‌ ఇంటికి చేరుకున్నారు. లోపల తలుపులు వేసుకుని కులవర్ధన్‌ ఎంతకీ తీయకపోవడంతో పోలీసులు గడియ పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ ఓ డ్రమ్ములో బాలిక మృతదేహం కనిపించింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement